రాష్ట్రీయం

గోదావరి నీటి తరలింపు.. ‘దుమ్ముగూడెం’ మీదుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భేటీలో గోదావరి జలాలు కృష్ణా ఆయకట్టుకు తరలించే అంశంపై ఏకాభిప్రాయం కుదరడంతో మళ్లీ ‘దుమ్ముగూడెం’ బ్యారేజి తెరపైకి వచ్చింది. ఇరు రాష్ట్రాల సాగునీటి అవసరాలు తీర్చనున్న దీనిని ఉమ్మడి
ప్రాజెక్టుగా చేపట్టడానికి ఇద్దరు సీఎంలు సూత్రప్రాయంగా నిర్ణయించారు. గోదావరి జలాలను కృష్ణానదీ పరీవాహక ప్రాంతానికి తరలించడానికి ‘దుమ్ముగూడెం’ అత్యంత అనువైన స్థలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులు, రిటైర్డు ఇంజనీరింగ్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఏడాదిలో కనీసం 150 రోజులు గోదావరిలో నీటి లభ్యత ఉండేది దుమ్ముగూడెం వద్దేనని కూడా ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో జరిగిన భేటీ సందర్భంగా దుమ్ముగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణం ఉభయతారకంగా ఉంటుందని సీఎం కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. సాధ్యమైనంత తక్కువ సమయం, తక్కువ వ్యయంతోనే గోదావరి జలాలను కృష్ణకు తరలించడానికి దుమ్ముగూడెం ఉత్తమమైందిగా చెప్పినట్టు సమాచారం. దుమ్ముగూడెం వద్ద బ్యారేజి నిర్మించడం వల్ల సహజసిద్ధంగా ఉన్న విశాలమైన చోట బ్యారేజి నిర్మించడం వల్ల 37 టీఎంసీల నీటిని నిలువ చేసుకొవచ్చని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ఇప్పటికే తనకు ఇంజనీరింగ్ నిపుణులు అందించిన నివేదికలో దుమ్ముగూడెం బ్యారేజి నిర్మాణానికి రూ. 13 వేల 500 కోట్ల నుంచి రూ. 14 వేల కోట్లకు మించకపోవచ్చని కూడా సీఎం కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. నీటి లభ్యత, తక్కువ వ్యయంతో పాటు తక్కువ ముంపునకు కూడా భౌగోళికంగా దుమ్ముగూడెం అనువైన చోటని చెప్పారని తెలిసింది. ఇలా ఉండగా దుమ్ముగూడెం బ్యారేజిని కేవలం సాగునీటి అవసరాల కోసమే కాకుండా విద్యుత్ ఉత్పాదనకు కూడా అవకాశం ఉన్నట్టు సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. ఇక్కడ బ్యారేజి వద్దనే 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని నిర్మించవచ్చని కూడా చెప్పినట్టు తెలిసింది. కృష్ణానదీలో నీటి లభ్యతకు గ్యారంటీ లేదు. దీని వల్ల తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు రాయలసీమ రైతులు కూడా సాగునీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాల కోసం కూడా కృష్ణానీటిని వినియోగించుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ ఉత్పాదన, మంచినీటి అవసరాల కోసం అతి తక్కువ వ్యయం, తక్కువ ముంపు, నికర జలాల లభ్యత, నీటి నిలువ సామర్ధ్యం అన్ని కోణాలు గోదావరి నీటిని కృష్ణాకు తరలించడానికి ‘దుమ్ముగూడెం’ ఎంపికపై ఇద్దరు సీఎంల ఏకాభిప్రాయానికి కారణమని సమాచారం.