బిజినెస్

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 14: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నర్సాపూర్ - సికింద్రాబాద్, మచిలీపట్నం - సికింద్రబాద్ మధ్య మూడు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. రైలు నెం. 07243 ఈ నెల 16, 17 తేదీల్లో సాయంత్రం 6గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ రైలులో రెండు ఏసీ టయర్, ఒక ఏసీ త్రీ టయర్, 12 స్లీపర్ క్లాస్, ఒక ఏసీ చైర్‌కార్, రెండు జనరల్ సెకండ్ క్లాస్, రెండు లగేజ్ కమ్ బ్రేక్‌వాన్ కోచ్‌లు ఉంటాయి. రైలు నెంబర్. 07251 ఈ నెల 19న రాత్రి 11.10 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలులో రెండు ఏసీ టూ టయర్, ఒక ఏసీ త్రీ టయర్, 12 స్లీపర్ క్లాస్, ఒక ఏసీ చైర్‌కార్, రెండు జనరల్ సెకండ్ క్లాస్, రెండు లగేజీ కమ్ బ్రేక్‌వాన్ కోచ్‌లు ఉంటాయని అధికారులు వివరించారు.