రాష్ట్రీయం

శ్రీశైల మల్లన్నకు రావణ వాహనసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం: శ్రీశైలంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం భోగి రోజు స్వామి, అమ్మవార్లకు రావణవాహన సేవ నిర్వహించారు. ఉదయం యాగశాలలో శ్రీ చండీశ్వర పూజలు ఆగమశాస్తం ప్రకారం నిర్వహించారు. రుద్రహోమం , పంచావరణార్చనలు జరిపించారు. సాయంకాలం ప్రదోషకాలపూజలు హోమాలు, జపానుష్టానాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి రావణ వాహనంపై ఆశీనులనుజేయించి అక్కమహదేవి అలంకార మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం వేడుకగా జరిగింది. ధర్మ ప్రచారంలో భాగంగా సుమారు 150 మంది ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపండ్లు పోశారు. అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించి చిన్నారులను అశీర్వందించారు. తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. పిడకలు, ఎండుగడ్డి, వంటచెరుకుతో ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద భోగిమంటలు వేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తరించారు.