రాష్ట్రీయం

ఇస్రో రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 16: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన ఇస్రో ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాల్లో జీశాట్- 30తో బోణీ కొట్టేందుకు సిద్ధమైంది. దేశ ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక జీశాట్ 30 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. దక్షిణ అమెరికా ఫ్రెంచ్‌గయానాలోని యూరోపియన్ స్పేస్ పోర్ట్ నుండి ఆ దేశానికి చెందిన ఏరియన్-5 రాకెట్ ద్వారా దీనిని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం 17వ తేదీ తెల్లవారుఝామున 2.35 గంటలకు జీశాట్-30తో ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. స్పేస్ పోర్ట్‌లోని మూడవ ఏరియన్ లాంచ్ కాంప్లెక్స్ నుండి ఈ ప్రయోగం జరుగనుందని ఇస్రో వెల్లడించింది. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా యురోపియన్ స్పేస్‌పోర్ట్ శాస్తవ్రేత్తలు లాంచ్ రెడీనెస్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 3.12 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఇస్రోకు చెందిన శాస్తవ్రేత్తల బృందం ఫ్రెంచ్‌గయానాకు చేరుకొని వాహననౌకలో జీశాట్-30 ఉపగ్రహాన్ని అనుసంధానం చేస్తున్నారు. ఈ ఉపగ్రహం బరువు 3357 కిలోలు. ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని ద్వారా టెలివిజన్, టెలీకమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి మెరుగైన సేవ లు అందుబాటులోకి రానున్నాయి. ఇది జియోస్టేషనరీ ఆర్బి ట్ నుండి టికెయు బ్రాండ్‌లో కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. దీనిని ఐ-జికెఫ్టాష్‌ఫామ్‌లో తయారుచేశారు. ఇన్‌శాట్-4 ఏకు ప్రత్యామ్నాయంగా జీశాట్- 30 పనిచేయనుం ది. భారత్‌తో పాటు అనుబంధ దేశాలకు ఈ శాటిలైట్ ద్వారా కెయు బ్రాండ్‌లో సిగ్నల్‌ను అందించనుండగా గల్ఫ్ దేశాలకు సి బ్రాండ్ ద్వారా కవరేజీ ఇవ్వనున్నారు. ఆసియాలోని కొన్ని దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు కూడా సేవలందిస్తారు.
''చిత్రాలు.. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్
*అంతరిక్షంలోకి పంపనున్న జీశాట్ శాటిలైట్