రాష్ట్రీయం

తొలిసారి ముఖం గుర్తింపు పరికరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓట్లు వేసేందుకు వచ్చే ఓటర్లను గుర్తించేందుకు తొలిసారి ‘పైలట్’ ప్రాతిపదికన మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని 10 కేంద్రాల్లో డిజిటల్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహా గుర్తింపు కేంద్రాలను దేశంలోనే ఇది ప్రథమమని తెలుస్తోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు తమ వెంట ఓటర్ గుర్తింపు కార్డును కానీ ఇతర గుర్తింపు కార్డులను కానీ తీసుకురావలసి ఉంటుంది. ఓటు వేసిన వారి చేతి వేలికి సిరా గుర్తు వేస్తారు. ఎవరైనా రెండు ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
దివ్యాంగులు ఓటు వేసేందుకు వస్తే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లో ఒక్కో అభ్యర్థి తరఫున ఒకరు ఏజంట్‌గా ఉండేందుకు అనుమతించారు. వారి వద్ద ఓటర్ల జాబితా ఉంటుంది. ఓటు వేసేందుకు వచ్చిన వారి వివరాలను తమ వద్ద ఉన్న ఓటర్ల జాబితాలో సరి చూడాల్సి ఉంటుంది.