రాష్ట్రీయం

ఒక్కరోజులో 51,621 ఉచిత లడ్డూల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 21: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ ఇచ్చే పథకాన్ని ధర్మకర్తల మండలి ఆమోదం పొందిన అనంతరం సోమవారం 51,621 మంది భక్తులకు ఉచితంగా లడ్డూలు అందించామని టీటీడీ అదనపు ఈ ఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తిరుమలలో విలేఖరులతో మాట్లాడుతూ భక్తులకు ఉచిత లడ్డూ అందించే పథకాన్ని సోమవారం నుంచీ అమలు చేస్తున్నామన్నారు. ఈనేపథ్యంలో సోమవారం 51,621 లడ్డూలను భక్తులకు ఉచితంగా అందజేశామని, అలాగే 1,59,814 లడ్డూలను ఒక్కో లడ్డూ రూ.50 చొప్పున విక్రయించామని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 29,241 మంది భక్తులకు ఉచితంగా లడ్లు అందించామని, 89,639 లడ్డూలను భక్తులకు విక్రయించామన్నారు.