రాష్ట్రీయం

కాకినాడ, తిరుపతికి ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కాకినాడ, తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు 30న ఆయా మార్గాల్లో నడుస్తాయి. సికింద్రాబాద్- కాకినాడ (07053) రైలు సికింద్రాబాద్‌లో 30వ తేదీన సాయంత్రం 6.05 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 2వ తేదీన కాకినాడ నుంచి సికింద్రాబాద్ (07054)కు రాత్రి 7 గంటలకు బయలుదేరి ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 30 వతేదీన రాత్రి 7.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో తిరుపతిలో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు.
ఒకటి నుంచి గుంతకల్ - కల్లూరు మధ్య రైళ్లరాకపోకలు
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అనంతపురం జిల్లా గుంతకల్ - కల్లూరు మధ్య ఈనెల 31వ తేదీ నుంచి రాకపోకలు జరుగుతాయని రైల్వే అధికారులు ప్రకటించారు. గుంతకల్ -కల్లూరు మధ్య 41 కిలోమీటర్ల రైలు మార్గాన్ని డబ్లింగ్‌తో పాటు విద్యుదీకరణ పూర్తి చేశారు. ఈ మార్గంలో తొలుత బెంగళూరు- హజరత్ నిజాముద్దీన్ (్ఢల్లీ) మధ్య రైలు ఈనెల 31వ తేదీన నడుపుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి రెగ్యులర్‌గా ఢిల్లీ, హైదరాబాద్, బళ్ళారి, గోవా రైళ్లు నడుస్తాయి. నూతన మార్గంతో ప్రయాణికులకు గంట సమయం ఆదా అవుతుంది.