రాష్ట్రీయం

శక్తిశాలిగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జనవరి 26: దేశాన్ని ప్రపంచంలో శక్తిశాలి దేశంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆ ప్రయత్నం జరుగుతుందని, దానికి దేశ ప్రజలంతా మద్దతు, ఆశీస్సులు కావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహా హారతి కార్యక్రమంలో 3వేల మంది బాలికలు భారతమాత వేషధారణలో వచ్చినట్లు తెలిపారు. తన మెడ మీద కత్తి పెట్టినా భారతమాతకు జై అనను ఆని హైదరాబాద్ నుంచి ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి అన్నాడు. ఏ గడ్డమీది నుంచి నువ్వు భారతమాతకు జై అనను అని అన్నావో అదే గడ్డ మీద భారతమాతకు నగర ప్రజలతో మహా హారతి ఇచ్చేందుకే భారత మాత ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్, ఐమాక్స్ పక్కన హెచ్‌ఎండీఏ మైదానంలో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాతకు మహా హారతి కార్యక్రమం చేపట్టారు. దీనికి ముఖ్యఅతిధులుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కే లక్ష్మణ్, సహస్రవధాని గరికపాటి నర్సింహారావు, ఎంపీ మోహన్ రావు, ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ రాములు, ఎమెల్సీ రాంచందర్ రావు హాజరయ్యరు. నేటి యువతలో జాతీయ భావన, దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతీయులు సగర్వంగా తలెత్తుకునే విధంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని అన్నారు. తాను కేవలం గవర్నర్‌గానే కాకుండా దేశభక్తి కలిగిన మీ సోదరిగా ఇక్కడికి వచ్చానని అన్నారు. ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, బలిదానాల ఫలితమే రెపరెపలాడుతున్న ఈ త్రివర్ణ పతాకం అని ఆమె పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు తాను హాజరైన అన్ని కార్యక్రమాలకన్నా గొప్పది, గర్వకారణమైనది భారతమాతకు హారతి కార్యక్రమని గవర్నర్ అన్నారు. ‘మనం మన భారతమాతకు గౌరవం ఇవ్వాలి. మనం మన సంస్కృతిని గురించి ఆలోచించాలి. సంస్కృతిని కాపాడాలి’ అని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని గవర్నర్ అభినందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు, ఇక్కడికి వచ్చిన యువతలో ఉన్న ఉత్సాహం చాలా బాగుంది అని ఆమె ప్రశంసించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జనసేత అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పదవుల కోసం తాను రాజకీయాలలోకి రాలేదని, దేశం కోసం ఎవరు త్యాగాలు, ఆత్మబలిదానాలు చేశారో వారిని స్ఫూర్తిగా తీసుకొని మనవంతు సేవ చేద్దామని వచ్చానని అన్నారు. భారతమాత పిలుపు తనను రాజకీయాలలోకి తీసుకువచ్చిందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని చూస్తుంటే మొదటగా భారతీయున్ని, చివరగా భారతీయుడినేనని ఆయన అన్నారు. ఎంతోమంది త్యాగాలు, బలిదానాల ఫలితంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ఉగ్రవాదులు పార్లమెంట్‌లో ఎంపీలపైనే, నాయకులపైన దాడి చేసినపుడు వారికే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందని బాదేసిందని ఆయన అన్నారు. మన దేశం వైపు చూడాలంటేనే భయపడాలి. అటువంటి నాయకత్వం రావాలని దేవుడిని ప్రార్థించానని, మోదీ రూపంలో ఇప్పుడు దేశానికి వచ్చింది సమర్ధవంతమైన నాయకత్వం అని ఆయన తెలిపారు. దేశ సేవలో మనమందరం కర్పూరంలా కరిగిపోదామని ఆయన పిలుపునిచ్చారు.

'చిత్రం... భారతమాత మహా హారతి కార్యక్రమంలో భారతమాత వేషధారణలోని విద్యార్థులతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి