రాష్ట్రీయం

అంటువ్యాధుల నివారణకు అంతర్జాతీయ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: కొత్తగా వస్తున్న అంటువ్యాధులను త్వరగా గుర్తించడానికి, నివారించడానికి అంతర్జాతీయ సహకారాన్ని పొందాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సోమవారం నాడు ఆయన సీసీఎంబీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అన్ని విభాగాలనూ సందర్శించి అక్కడ జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. పరిశోధనాలయంలో అడుగుపెట్టడం తనకెంతో సంతోషాన్నిస్తోందని చెప్పిన వెంకయ్యనాయుడు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన కరోనా వైరస్‌పై శాస్తవ్రేత్తలు దృష్టి సారించాలని, దాని నివారణకు చర్యలు సూచించాలని చెప్పారు. సీసీఎంబీ శాస్తవ్రేత్తల పరిశోధనలను పరిశీలించిన ఆయన అక్కడి శాస్తవ్రేత్తలను అభినందించారు. కరోనా వైరస్ దేశ ప్రజలను, ఆరోగ్య అధికారులను ఆందోళన కలిగిస్తోందని, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. భారతదేశం స్థిరమైన సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నందున జాతీయ లక్ష్యాలను సాధించడంలో ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కీలక పాత్ర పోషించిందని, సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న శాస్ర్తియ ప్రాజెక్టులను చేపట్టేందుకు వీలుగా ప్రైవేటు సంస్థలు ఒక నిధిని రూపొందించాలని ఆయన సూచించారు. ఎస్‌టీఐలో పెట్టుబడులు పరిశోధనలను ప్రోత్సహించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తాయని కనుక ప్రాథమిక స్థాయి పరిశోధనలకు కూడా నిధులు పెంచాలని చెప్పారు. ప్రతి శాస్ర్తియ ప్రయత్నం ప్రజల జీవితాలను మెరుగుపరచాల్సి ఉంటుందని అన్నారు. పేదరికం, వాతావరణ మార్పులు, కాలుష్యం, అపరిశుభ్రత వంటి సవాళ్లకు శాస్తవ్రేత్తలు పరిష్కారాలను కనుగొనాలని అన్నారు. తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, పెరుగుతున్న పట్టణీకరణ, వ్యాధి నిరోధకత తగ్గిపోవడంపై కూడా శాస్తవ్రేత్తలు మార్గం చూపాలని ఉప రాష్టప్రతి అన్నారు. ఇండియన్ రైస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ సహకారంతో సీసీఎంబీ బాక్టీరియా నిరోధక సాంబా మసూరి బియ్యం రకాన్ని అభివృద్ధి చేయడంపై ఆయన అభినందనలు తెలిపారు. వ్యాధి, తెగులు నిరోధక పంటలను అభివృద్ధి చేయడానికి మార్గాలను కనుగొనాలని ఆయన సూచించారు. రోజురోజుకూ సూక్ష్మజీవుల తాకిడి ఎక్కువైందని పేర్కొన్న ఉప రాష్టప్రతి ఎప్పటికపుడు సమీక్షించుకోకుంటే ఆధునిక మందులు కొంతకాలానికి నిష్ప్రయోజనం అవుతాయని ఆయన పేర్కొన్నారు. వ్యాధి నిరోధకతను పెంచేవిధంగా యాంటీబయాటిక్‌లను అభివృద్ధి చేస్తూ సీసీఎంబీ సవ్యమైన దిశలోనే పయనిస్తోందని అన్నారు.
అరుదైన వ్యాధుల కారకాలను గుర్తించడంలో డీఎన్‌ఏ టెస్టింగ్ కిట్‌లను అభివృద్ధి చేయాలని ఉప రాష్ట్రపతి సీసీఎంబీని కోరారు. ఆర్గనైజేషన్ ఫర్ డిసీజెస్ ఇండియా నివేదిక ప్రకారం 70 మిలియన్ల మంది భారతీయులు జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్నారని అంచనా వేసిందని, ఈ నేపథ్యంలో జన్యువ్యాధుల నివారణ తక్షణ కర్తవ్యమని ఆయన అన్నారు. పుట్టుకతో వచ్చే ఆరోగ్య ప్రమాదాల గురించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పీర్‌రివ్యూ పబ్లికేషన్స్‌లో భారతదేశం మూడో స్థానానికి చేరుకుందని, ఆత్మసంతృప్తికి ఎలాంటి పరిమితి ఉండదని, భారత్ అగ్రస్థానానికి చేరుకోవాల్సి ఉందని చెప్పారు. పరిశోధనలకు, వినూత్న ఆలోచనలతో యువ శాస్తవ్రేత్తలు ముందుకు రావాలని, పరిశోధనలను సవాల్‌గా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా, వివిధ ల్యాబ్‌ల డైరెక్టర్లు, సీనియర్ శాస్తవ్రేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని సీసీఎంబీని సోమవారం సందర్శించిన సందర్భంగా జరిగిన సమావేశంలో
ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు