రాష్ట్రీయం

ఖమ్మం జిల్లాలో ఏకపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 27: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ఐదు మున్సిపాల్టీల చైర్మన్ పదవులు తెలంగాణ రాష్ట్ర సమితి ఖాతాలోకే చేరాయి. సోమవారం జరిగిన చైర్మన్ ఎన్నికల్లో మధిరలో మాత్రమే ప్రతిపక్ష పార్టీల కూటమి అభ్యర్థి పోటీలో నిలబడగా మిగిలినవన్నీ ఏకగ్రీవంగానే సాగాయి. ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, వైరా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాల్టీల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబర్చింది.
సోమవారం మధిరలో మాత్రమే టీడీపీ అభ్యర్థిని చైర్మన్ పదవి కోసం పోటీలో నిలపగా ఆరు ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి పొందారు. ఇల్లెందులో దమ్మలపాటి వెంకటేశ్వర్లు, వైరాలో సూతగాని జైపాల్, సత్తుపల్లిలో కూసంపుడి మహేష్, కొత్తగూడెంలో కాపు సీతాలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మధిరలో మాత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థి మొండితోక లత టీడీపీ అభ్యర్థిపై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ మధిరలో మాత్రం ప్రతిపక్ష పార్టీల కూటమి అభ్యర్థి చైర్మన్ పదవి కోసం బరిలో నిలిచారు. అయితే స్వతంత్ర అభ్యర్థితో కలిపి టీఆర్‌ఎస్ అభ్యర్థికి 14ఓట్లు లభించగా కూటమి తరపున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి 8ఓట్లు లభించాయి.
ఇదిలా ఉండగా ఐదు మున్సిపాల్టీల ఎన్నికలు ఈ నెల 22వ తేదీన జరగగా 25వ తేదీన కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే గెలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులతో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరం నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి సోమవారం ఉదయం ఆ పార్టీ నాయకులు గెలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులను తీసుకొని వచ్చారు. సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు లాంటి చోట్ల భారీ మెజార్టీ సాధించినప్పటికీ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం విశేషం. కాగా గెలిచిన అభ్యర్థులంతా తమ ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో తమ పట్టణాలను అభివృద్ధి చేసుకుంటామని స్పష్టం చేయడం విశేషం.