రాష్ట్రీయం

పోస్టల్ ద్వారా ఆలయాల ప్రసాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: తెలంగాణలోని ప్రధాన దేవాలయాల ప్రసాదాన్ని భక్తులకు వారి ఇంటి వద్దకే అందించేందుకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ వినూత్న పథకానికి శ్రీకారం చుడుతోంది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమినర్ వి. అనిల్‌కుమార్ నేతృత్వంలో బుధవారం జరిగే సమావేశంలో ‘ఇండియన్ పోస్ట్’ అధికారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకునే అవకాశం ఉంది. బాసర, భద్రాచలం, వేములవాడ, యాదగిరిగుట్ట తదితర దేవాలయాల ప్రసాదాల పట్ల భక్తులకు అత్యంత నమ్మకం ఉంది. అందుకే ఈ ఆలయాల ప్రసాదాలను భక్తులకు వారి ఇంటి వద్దకే ‘పార్శిల్’ ద్వారా చేరవేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రసాదాలను ఏ విధంగా ప్యాక్ చేయాలి, ఏ ఏ ప్రసాదాలను పోస్టల్ ద్వారా పంపించేందుకు వీలు ఉంటుంది, ఏ ఏ సమయాల్లో పోస్టల్‌శాఖకు అప్పగించాలన్న అంశాలతో పాటు ఇతర అంశాలపై సమగ్రంగా చర్చిస్తారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు అన్ని ప్రధన దేవాలయాల అధికారులు హాజరవుతున్నారు. సమగ్రంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారని తెలిసింది.