రాష్ట్రీయం

గ్రూప్ -4 అభ్యర్థులకు మరో అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ - టైపిస్టు గ్రూప్ -4 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ 2018 అక్టోబర్ 7వ తేదీన లిఖిత పరీక్ష నిర్వహించింది. అందులో అర్హులైన వారిని ఎంపిక చేయడం జరిగింది, అయితే మిగిలి పోయిన పోస్టులకు రెండో దశలో మరికొంత మందికి పబ్లిక్ సర్వీసు కమిషన్ అవకాశం కల్పించింది. వారందరికీ జనవరి 28 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన అవకాశం ఇచ్చింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో అభ్యర్ధులు వెబ్ ఆప్షన్లను ఇవ్వాలని సర్వీసు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో కోరారు. ఈ అవకాశం ఇప్పటికే వెబ్ పోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చామని అన్నారు.
లిఖిత పరీక్ష
కేఎన్‌ఆర్‌యూహెచ్‌లో స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు మార్చి 1వ తేదీన లిఖిత పరీక్ష నిర్వహించనున్నట్టు సర్వీసు కమిషన్ ప్రకటించింది. అభ్యర్ధులు ఇతర వివరాలను కమిషన్ వెబ్ పోర్టల్‌లో పొందాలని సూచించింది. కాగా నోటిఫికేషన్ నెంబర్ 53/2017 ద్వారా ఉర్దూ మీడియం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు 32 మంది ప్రత్యేక అవసరాలున్న అభ్యర్ధులను ఎంపిక చేశామని, వారి సర్ట్ఫికేట్ల పరిశీలన జనవరి 31 నుండి జరుగుతుందని కమిషన్ పేర్కొంది.
అలాగే తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్-2, డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ -2 పోస్టులకు ఎంపికైన అభ్యర్ధుల సర్ట్ఫికేట్ల పరిశీలన జనవరి 31 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకూ జరుగుతుందని కమిషన్ పేర్కొంది.
డిపార్టుమెంటల్ పరీక్షలు
డిసెంబర్14 నుండి 23వ తేదీ వరకూ నిర్వహించిన డిపార్టుమెంటల్ పరీక్షల ఆబ్జెక్టివ్ టైప్ రెస్పాన్స్‌షీట్‌లను పబ్లిక్ సర్వీసు కమిషన్ వెబ్ పోర్టల్‌లో ఉంచింది.