రాష్ట్రీయం

దిశ యాప్‌కు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 13: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాప్‌కు విశేష స్పందన లభిస్తోందని దిశ స్పెషల్ ఆఫీసర్ దీప గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు రోజుల్లోనే 50 వేల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. యాప్ ద్వారా పోలీసులు స్పందిస్తున్న తీరుకు గూగుల్ ప్లే స్టోర్‌లో ఏకంగా 5 పాయింట్లకు 4.9 స్టార్ రేటింగ్ వచ్చిందన్నారు. 9వ తేదీ నుండి రోజుకి సగటున 2 వేలకు పైగా దిశ యాప్ ద్వారా పోలీసు కమాండ్ రూమ్‌కు టెస్ట్ కాల్స్ వస్తున్నాయన్నారు. దిశ చట్టాన్ని అమలులోకి వచ్చిన 24 గంటల్లోనే మొదటి కేసులో పోలీసులు స్పందించిన తీరుపైనా, బాధితురాలికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించడంపైనా ప్రతి ఒక్కరూ పోలీసులకు అభినందనలు తెలుపుతున్నారన్నారు. చేతిలోని మొబైల్ ఫోన్‌ను మూడుసార్లు ఊపడం ద్వారా దిశ ఎస్‌ఒఎస్ సెంటర్‌కు బుధవారం వచ్చిన ఫిర్యాదుల్లో రెండు భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలని, గొడవ చోటు చేసుకున్న సమయంలో తన భర్త విచక్షణ కోల్పోయి కొడుతుంటే బాధిత మహిళ తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను ఊపడం ద్వారా దిశ కంట్రోల్ సెంటర్‌కు ఫిర్యాదు అందిందన్నారు. తక్షణమే స్పందించిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి వద్దకు చేరుకుని భర్త వేధింపుల నుండి రక్షించారన్నారు. ఈ ఫిర్యాదులో ఒకటి కృష్ణా జిల్లాది కాగా, మరొకటి విశాఖపట్నంకు చెందినదన్నారు. దిశ అప్లికేషన్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం కుటుంబ సమస్యలతోనే ఉంటున్నాయని, అలాంటి వారి పట్ల నిపుణులైన వారిచే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.