రాష్ట్రీయం

ముముక్షు గౌతమ్ సన్యాస దీక్షా మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: జైనమత సన్యాస దీక్షాధారణ ప్రక్రియకు రాజమహేంద్రవరం వేదికైంది. ఉభయ రాష్ట్రాల్లోనూ మొట్ట మొదటి సారిగా జైనమత దీక్షా ధారణకు రాజమహేంద్రవరం వేదిక కావడం చారిత్రాత్మక విశేషత సంతరించుకుంది. ఇప్పటి వరకు రాజస్థాన్‌లోనే ఈ దీక్షా ధారణ జరిగింది. ఇపుడు రాజస్థాన్ నుంచి రాజమహేంద్రవరం వేదికైంది. రాజమహేంద్రవరానికి చెందిన శారదాదేవి, దిలీప్‌కుమార్‌ల కుమారుడు గౌతమ్‌కుమార్ సన్యాస దీక్ష స్వీకరిస్తున్న సందర్భంగా జరుగుతున్న విద్యార్థి ముముక్షు గౌతమ్ దీక్షా మహోత్సవంలో భాగంగా శనివారం శోభాయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సాంప్రదాయబద్ధంగా సాగింది. స్థానిక పప్పుల వీధిలోని దిలీప్‌కుమార్ నివాసం నుంచి సన్యాసం స్వీకరించనున్న వారి కుమారుడు గౌతమ్‌కుమార్‌ను రెండు అశ్వాలు కలిగిన రథంపై ఊరేగింపుగా ప్రార్ధనా కార్యక్రమాలు నిర్వహించే త్యాగరాయ కళా క్షేత్రానికి తీసుకొచ్చారు. ఎండ్లబండ్లు, అశ్వ రధాలు, ఒంటెల సవారీలు, డప్పు డమరుకాలు, ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన డప్పు కళాకారుల వాయిద్యాలతో భారీ స్థాయిలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జైనులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగానూ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కుటుంబ సమేతంగా గోదావరి తీరానికి తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వాయిద్య కళాకారులు ఆయా రాష్ట్రాల సంప్రదాయ వాయిద్యాలను ప్రదర్శించారు. నగరంలోని మార్వాడీ కుటుంబాలకు చెందిన వారంతా భక్తిశ్రద్ధలతో ఈ యాత్రలో పాల్గొన్నారు. చిన్నారులు వివిధ రకాల అలంకారాలతో శాఖాహారమే శ్రేష్టమంటూ వినూత్న సందేశాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. రెండు దవళ అశ్వాల రధంపై దీక్షకు సిద్ధమైన విద్యార్ధి గౌతమ్‌కుమార్‌ను కూర్చోబెట్టి ఆ వెనుక భాగంలో అతని తల్లిదండ్రులు శారదాదేవి, దిలీప్‌కుమార్ ఆశీనులను చేసి ఊరేగింపు నిర్వహించారు.
*చిత్రం...జైన సన్యాసదీక్ష స్వీకరించనున్న గౌతమ్ కుమార్‌ను రాజమహేంద్రవరంలో అశ్వరథంపై ఊరేగిస్తున్న దృశ్యం