రాష్ట్రీయం

వైసీపీ, టీఆర్‌ఎస్ నేతల విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన రాష్టస్థ్రాయి సమావేశంలో పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చంచారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పనితీరుపై చర్చించారు. ఏపీలో వైసీపీ, తెలంగాణల తెరాస నేతలు టీడీపీపై చేస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఇటీవల జరిగిన స్థానిక మున్సిపల్, సహకార ఎన్నికలపై పార్టీ నేత ఆరా తీశారు. తెలంగాణలో 14 పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఏర్పాటు చేసిన కమిటీల పనితీరుపై చంద్రబాబుకు వివరించారు. సహకార ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస రాజకీయాలు చేయడం దునదృష్టకరమన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ 281వ జయంతి కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి, నర్సిరెడ్డి, మీడియా ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి హజరు అయ్యారు. పార్టీ మహిళా అధ్యక్షురాలుగా జ్యోత్న్స తొలి సమావేశంలో పాల్గొన్న మహిళలకు దిశానినే్ధశాన్ని చంద్రబాబు సూచించారు. రానున్న రోజుల్లో మహిళల పాత్ర పార్టీలో కీలంగా ఉండాలన్నారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అనచివేతలపై పార్టీ మహిళలు ప్రణాళికంగా కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టాలన్నారు.
*చిత్రం...తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడుతున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు