రాష్ట్రీయం

మాజీ స్పీకర్ అగరాల కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట/తిరుపతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, సీనియర్ రాజకీయ నేత అగరాల ఈశ్వర్‌రెడ్డి ఆదివారం గుండెపోటుతో తిరుపతిలో కన్నుమూశారు. తిరుపతి బాలాజీనగర్‌లో నివాసముంటున్న ఆయన గత మూడురోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతి స్విమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. అగరాల మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, సీపీఐ నేత నారాయణ తదితర ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు.
1967లో తిరుపతి శాసనసభకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యిర్థి గురువారెడ్డిపై గెలుపొందారు. మళ్లీ 1978 నుంచి 1983 వరకు ఇందిరాకాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి నుంచి శాసనసభ్యులుగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అసెంబ్లీ స్పీకర్‌గా ఐదేళ్ల పాటు కొనసాగగా 1967లో నాల్గవ శాసనసభకు, 1978లో ఆరో శాసనసభకు చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. వీరు 1980-81 మధ్యకాలంలో ప్రభుత్వ సంస్థల కమిటీకి అధ్యక్షులుగా పనిచేశారు. 1981-82లో డిప్యూటీ స్పీకర్ హోదాలో అర్జీల విశేష అధికారాల కమిటీల అధ్యక్షుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అసోసియేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఐఐపీఎ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా, ఎస్వీ యూనివర్శిటీలో సిండికేట్ మెంబర్‌గా ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ బోర్డుమెంబర్, ఉస్మానియా యూనివర్శిటీ సెనైట్ మెంబర్‌గా పనిచేశారు. అంతేకాకుండా అగరాల మంచి రచయిత. లోక్‌సభ ఎలక్షన్స్ ఇన్ 1977 -1985 ఇన్ ఆంధ్రప్రదేశ్ ది ఎలక్ట్రోల్ రీఫామ్ ఆఫ్ ఇండియా స్టేట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా అండ్ హో.హైఈఎస్ పుస్తకాలను రచించారు. పలు వార్తాపత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈశ్వర్‌రెడ్డి సేవలకు గుర్తింపుగా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుతో సత్కరించింది.
గొప్ప నేతను కోల్పోయాం: పలువురు ప్రముఖుల నివాళి
ఉమ్మడి రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నేతగా, విద్యావేత్తగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన గొప్ప నేతను కోల్పోయామని జిల్లాలోని పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు. స్పీకర్‌గా పనిచేసి పార్టీలకతీతంగా ఆ పదవికే వనె్న తెచ్చారని కొనియాడారు. జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు ఈశ్వరరెడ్డి మృతి పట్ల తమ సంతాపం ప్రకటించారు.

* ఈశ్వర్ రెడ్డి (ఫైల్‌ఫొటో)