రాష్ట్రీయం

కన్నుల పండువగా ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి: ముల్లోకాలను ఏలే ముక్కంటీశ్వరుడికి ధ్వజారోహణం శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం కన్నుల పండువగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు భక్తకన్నప్ప కోడి అయ్యాక స్వామివారి ధ్వజారోహణం నిర్వహిస్తుంటారు. పాల సముద్రాన్ని చిలికిన సందర్భంగా వచ్చిన హాలాహలాన్ని మింగిన శివుడు మగత నిద్రలోకి వెళ్లిపోవడంతో ఆయన్ను మేల్కొలపడానికి ముక్కోటి దేవతలందరూ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీన్ని ధ్వజారోహణంగా దేవరాత్రి అనికూడా అంటారు. అంతేకాకుండా బ్రహ్మోత్సవ నిర్వహణ బాధ్యత మొత్తం నందీశ్వరుడి భుజస్కందాలమీద వేస్తారు. ఆయనకు ఉత్సవాల సందర్భంగా ఈ అరుదైన అవకాశం లభిస్తుంది. శ్రీ కాళహస్తీశ్వరుడికి ఎదురుగా ఉన్న బంగారు ధ్వజస్తంభం వద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఏర్పాటుచేయగా పక్కనే వినాయకస్వామి, భక్తకన్నప్ప, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, భక్తకన్నప్ప, చండికేశ్వరుని ఉత్సవమూర్తులను ఉంచారు. అక్కడే యాగకలశాలు, త్రిశూలం ఏర్పాటుచేసి వేదపండితులు, పురోహితులు ఆధ్వర్యంలో శాస్తబ్రద్దంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ప్రధాన మూర్తులతో పాటు ఉత్సవమూర్తులకు కంకణధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలు మర్మోగుతుండగా కొడితాడుతో ధవళవస్త్రానికి ప్రత్యేకపూజాది కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత ధవళవస్త్రాన్ని భక్తుల హరహర మహాదేవ, ఓం నమఃశ్శివాయ నామస్మరణల మధ్య ధ్వజస్తంభం మీదకు చేర్చారు. అనంతరం ధూప, దీప కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. మహిళలు ఈకార్యక్రమానికి చీరలు ఇచ్చి మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈఓ తోపాటు డీఎస్పీ నాగేంద్రుడు, టౌన్ సీ ఐ నాగార్జున్‌రెడ్డి, ఏ ఈ ఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
వెండి అంబారిపై స్వామి, అమ్మవార్ల దివ్యతేజం
వెండికొండలపై కొలువుదీరిన కైలాసనాధుడు వెండి అంబారీలపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించాడు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామి, అమ్మవార్లు వెండి అంబారీ వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. శ్రీ కాళహస్తీశ్వరాలయంలోని అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం చతుర్మాడావీధుల్లో స్వామి,అమ్మవార్లు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

*చిత్రం... శ్రీకాళహస్తి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్న ఆది దంపతులు, వినాయక, వల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి తదితర పంచమూర్తులు