రాష్ట్రీయం

సీపీఎస్‌పై ఇతర రాష్ట్రాల విధానాలు పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 18: వివిధ రాష్ట్రాల్లో కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)పై అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. కంట్రిబ్యూటరీ పింఛన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. త్వరలో నివేదికను అందజేయాల్సి ఉందన్నారు. సీపీఎస్ ఉద్యోగులు కూడా ఈ ఆంశంపై అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న నేపథ్యంలో దీనిపై త్వరితగతిన స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి నివేదిక సమర్పిస్తేదాన్ని సమీక్షించి కమిటీ నివేదికను సమర్పించాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహించరాదన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి జీ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.