రాష్ట్రీయం

భక్తులతో పోటెత్తిన శ్రీగిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం/శ్రీశైలం టౌన్, ఫిబ్రవరి 20: మహాశివరాత్రి రోజు మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో శ్రీగిరికి చేరుకుంటున్నారు. ఓం నమఃశివాయ నామస్మరణతో శ్రీశైలం మారుమోగుతోంది. సుమారు 4 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నట్లు తెలుస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. రాత్రి 10.30 గంటలకు జరిగే పాగాలంకరణ, అర్ధరాత్రి జరిగే లింగోద్భవ పూజల కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకంగా నేసిన పాగాను స్వామి భక్తుడు వెంకటేశ్వర్లు దిగంబరంగా ఆలయం గోపురంపై ఉన్న నవనందులను కలుపుతూ అలంకరిస్తాడు. ఈ సమయంలో ఆలయ పరిసరాల్లోని విద్యుత్‌దీపాలను ఆర్పివేస్తారు. అలంకరణ పూర్తయిన తరువాత విద్యుత్ దీపాల వెలుగులో పాగాలంకరణ దృశ్యం చూసితీరవలసిందే తప్ప వర్ణించశక్యం కాదు. అర్ధరాత్రి స్వామివారికి లింగోద్భవకాల పూజలు నిర్వహిస్తారు. అనంతరం తెల్లవారుజామున స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తారు. భక్తులతో శ్రీగిరి వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. కాలినడక భక్తులు, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో వచ్చిన భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిదర్శనానికి బారులుతీరారు. ఇరుముడి కట్టుకున్న శివస్వాములు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వీరికి దేవస్థానం వారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, నీళ్లప్యాకెట్లను దేవస్థానం సిబ్బంది అందజేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
*చిత్రం... భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం వీధులు