రాష్ట్రీయం

నాగేంద్ర హారాయ.. సదాశివాయ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి: ముల్లోకాలు ఏలే ముక్కంటీశ్వరుడు హంస, చిలుక వాహనాలపై దర్శనభాగ్యం కల్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నాలుగో తిరుణాళ్లు జరిగాయి. దీనే్న నాగరాత్రి అని కూడా అంటారు. ఉదయం బంగారునగలతో, ప్రత్యేక పూల అలంకరణలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను, పరివార దేవతలను అలంకార మండపంలో అత్యంత సుందరంగా అలంకరింపచేశారు. అనంతరం ఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓ మోహన్‌లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చారు. స్వామివారిని హంసవాహనంపై అధిష్టించగా, అమ్మవారిని చిలుక వాహనంపై అధిష్టించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులతో కలిసి మూషికవాహనంపై బొజ్జ గణపయ్య, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వర స్వామి ఉత్సవమూర్తులు స్వామితోపాటు ఊరేగింపుగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోలాటాలు, కళాకారుల రకరకాల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చుక్కల నిడిగల్లు గ్రామానికి చెందిన ముద్దుకృష్ణారెడ్డి ఉభయదాతగా వ్యవహరించారు. ఈయన ఆలయానికి 42 ఎకరాలు భూదానం సమర్పించారు. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
*చిత్రం... శ్రీకాళహస్తి మాడ వీధుల్లో హంస, చిలుక వాహనాలపై విహరిస్తున్న ఆది దంపతులు