రాష్ట్రీయం

నంది సేవకు తరలివచ్చిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 22: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్థరాత్రి నిర్వహించిన నందిసేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతేడాదికంటే ఈసారి భక్తులు భారీగా తరలివచ్చి నంది వాహనంపై కొలువుదీరిని పరమ శివుని దర్శించుకున్నారు. అర్థరాత్రి తరువాత నంది వాహనసేవ ఊరేగింపు ప్రారంభమైనా నాలుగు వీధుల్లోను ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. ఈ ఉత్సవాన్ని నగరి ఎమ్మెల్యే రోజా తిలకించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు జాగారణ చేశారు. ఈ సందర్భంగా గాయకులు మణిశర్మ, కోటి తదితరులు భక్తి గీతాలను ఆలపించి భక్తులను తన్మయత్వానికి గురిచేశారు.
భూమే ఒక రథంగా, సూర్య చంద్రులే రథ చక్రాలుగా, నాలుగు వేదాలే గుర్రాలుగా, బ్రహ్మసారథ్యంలో రథోత్సవం సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళమస్తిలో ఆరోరోజున రథోత్సవం నిర్వహిస్తారు. హాలాహలం మింగిన పరమశివుడు తిరిగి మేల్కొన్న తరువాత బ్రహ్మచేసిన ఉత్సవమే రథోత్సవంగా పిలుస్తారు. స్వామి రథంతోపాటుగా జగజ్జనని అయిన అమ్మవారు కూడా రథంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలో నిర్వహించిన రథోత్సవాన్ని తిలకించి భక్తులు పరవశించి పోయారు. శ్రీకాళహస్తీశ్వరాలయం స్వామి, అమ్మవార్లకు ఉదయం అభిషేకాలు పూర్తయిన తరువాత ఉత్సవ మూర్తులను అలంకార మండపంలో అత్యంత సుందరంగా అలంకరించారు. అపురూపమైన బంగారు ఆభరణాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం వేద పండితులు వేదమంత్రాలు పటిస్తుండగా రథంపైన కొలువుదీర్చారు.
ముందుగా గంగాదేవి సమేతుడైన సోమ స్కంధమూర్తి రథాన్ని, ఆ తరువాత జ్ఞాన ప్రసూనాంబ రతానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. స్వామివారి రథాన్ని హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు ఉత్సాహంగా ముందుకు లాగారు. ముందుగా స్వామివారి రథాన్ని అధికారులు, అనధికారులు, భక్తులు లాగారు. ఆతరువాత అమ్మవారి రథాన్ని లాగారు. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన రథోత్సవంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. రథంపై ఉప్పు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. నగరి ఎమ్మెల్యే రోజా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఈ ఓ చంద్రశేఖర్ రెడ్డి, ప్రత్యేకాధికారి పూర్ణచంద్ర రావు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య రాహుకాలం కావడంతో 11 గంటలకు ఉత్సవమూర్తులను ఆలయం నుంచి వెలుపలికి తీసుకువచ్చి 11.30 గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించారు.

*చిత్రం... శ్రీకాళహస్తి వీధుల్లో నందివాహనంపై ఊరేగుతున్న ఆదిదంపతులు