రాష్ట్రీయం

లాభాల పంటగా సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్: రైతులు, పరిశోధకులు, శాస్తవ్రేత్తలు సంయుక్తంగా కృషి చేసి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కొత్త విధానాలు, ఇన్నోవేషన్స్ కనుగొనడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అగ్రిటెక్ సౌత్ 2020, అగ్రివిజన్ 2020 సదస్సు ప్రదర్శనను ఆయన శనివారం వర్సిటీ ప్రాంగణంలో ప్రారంభించారు. వ్యవసాయం మన దేశానికి వెనె్నముక అని, వౌళిక సంస్కృతి అని వెంకయ్య నాయుడు అన్నారు. మన వ్యవసాయ విధానాలు ఇతర దేశాలు అవలంభించిన అధిక ఉత్పత్తి, ఉత్పాధకతలు సాధిస్తున్నాయన్నారు. కానీ భారతదేశంలో వ్యవసాయ రోజురోజుకీ గిట్టుబాటు కావడం లేదని ఆయన వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా, ఆకర్షణీయంగా మార్చడానికి అందరూ కృషి చేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దేశంలో ఇంకా వరి, గోధుమ వంటి సంప్రదాయ పంటలనే ఎక్కువ సాగు చేస్తున్నారని, ఆ విధానం మరే ఇతర పంటల సాగు పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. డయాబెటిస్ నియంత్రించే లక్షణాలు కల వరి సాగుని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. వ్యవసాయంతో పాడిపంట, కోళ్ల పెంపకం, చేపల సాగు వంటివి చేపడితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు. నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి పనితీరు కనబరుస్తుందని అభినందించారు. దేశవ్యాప్తంగాగ సంప్రదాయ నీటి వనరుల పరిరక్షణ, పునరుద్ధరణ అత్యవసరమని అభిప్రాయపడ్డారు. సమాజంలో అన్ని వర్గాలు ముందుకెళ్తున్నా రైతులు ఆశించిన విధంగా ముందుకెళ్లడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సంక్షేమం కోసం ఎంతో చేసినా, చేస్తున్నా చేయవలసింది కూడా చాలా ఉందని అన్నారు. టమాటాలు, ఆలుగడ్డలు వంటి రైతులకు గిట్టుబాటు ధరలు ఏ మాత్రం రానప్పటికీ, వాటి ప్రాసెస్‌డ్ ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎక్కువ ధరలు ఉంటున్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, వాల్యూ ఎడిషన్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 50 శాతం రైతులు ఇంకా రుణాల కోసం ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలపై ఆధారపడటం శోఛనీయమని అన్నారు. తాను రుణమాఫీలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అటువంటి తాత్కలిక ఉపశమన చర్యల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే కార్యక్రమాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని వెంకయ్యనాయుడు సూచించారు. సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నిల్వ సదుపాయాలు, రోడ్లు ఇతర వౌలిక సదుపాయాలు, గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు. అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు, కొత్త టెక్నాలజీలు, పురుగు మందులు వంటివి కనిపెట్టి ఉత్పత్తి, ఉత్పాధకతలు పెంచి పోషకాలతో కూడిన ఆహార భద్రత కల్పించాలని ఆయన సూచించారు. రైతులకు మించిన శాస్తవ్రేత్త లేడని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే నేడు నూతన ఆవిష్కరణలతో వ్యవసాయం చేస్తున్న రైతులకు పద్మ అవార్డులు వస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. విద్యార్థులు 50 శాతం థియరీ నేర్చుకొని, 50 శాతం పొలాల్లో తిరిగి విజ్ఞానం నేర్చుకోవాలని సూచించారు. పిజెటి ఎస్ ఏయూ డయాబెటిస్ నియంత్రించే కొత్త వరి వంగడాలను రూపకల్పన చేయడం అభినందనీయమని వెంకయ్యనాయుడు అన్నారు. సమాజంలో సింహభాగం అయిన రైతాంగ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తుందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వివరించారు. రైతుబంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. నీటిపారుదల సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. రైతుపక్షపాతి అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సదస్సుని ప్రారంభించడం సంతోషం అని వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ వీ.ప్రవీణ్‌రావు అన్నారు. ఏర్పాటైన కొద్ది కాలంలోనే దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పిజెటి ఎస్ ఏయూ 3 వ స్థానానికి చేరుకుందన్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్త వంగడాల రూపకల్పనకు పిజెటి ఎస్ ఏయూ కృషి చేస్తుందన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన టెక్నాలజీలని వినియోగిస్తున్నామని అన్నారు. వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులకు అధునాతన పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ప్రవీణ్‌రావు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, సీ ఐ ఐ తెలంగాణ చైర్మెన్ డి.రాజు, అగ్రిటెక్ సౌత్ 2020 చైర్మెన్ అనిల్‌కుమార్, సీ ఐ ఐ అగ్రికల్చర్ ప్యానల్ కన్వీనర్ జీవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
*చిత్రం... ప్రసంగిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు