రాష్ట్రీయం

మాతృభాషలోనే ప్రాథమిక విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 23: ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని, భాష, భావన వేర్వేరుగా చూడలేమని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం వరంగల్ నగరంలోని ఆంధ్ర విద్యాభివర్ధిని విద్యాసంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పరిపాలన భాషగా మాతృభాష ఉండాలని తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతానని వెల్లడించారు. భాషా ప్రాధాన్యతను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యోగానికి, భాష అధ్యయనానికి ముడిపెట్టాలని ఆయన అన్నారు. తల్లిదండ్రులు, గురువులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాన్ని ప్రతి పాఠశాలల్లో బోధించాలన్నారు. ఇటీవల బీటెక్ రెండవ సంవత్సరంలో నైతిక విలువలపై ఒక పాఠ్యాంశం ఉండటాన్ని ఆయన అభినందించారు. తెలుగు మాధ్యమంలో విద్యాబోధన ద్వారానే వికాసం ఉం టుందన్నారు. జన్మభూమి, మాతృభాష మరవద్దని కోరారు. మాతృ గర్భం నుండి వచ్చిన భాషను ఎట్టిపరిస్థితుల్లో మరవొద్దని అన్నారు. ఇటీవల కాలంలో పాశ్చాత్య
వ్యామోహం పెరిగిపోవడంతో మాతృ భాష నిరాదరణకు గురైందన్నారు. తానే కాకుండా భారత రాష్ట్రపతి, భారత ప్రధాన మంత్రి మోదీ కూడా కానె్వంట్ పాఠశాలల వైపు కనె్నత్తి చూడకపోయినా ఉన్నత పదవులు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తెలుగు భాష ప్రావీణ్యం ఉన్నందునే ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందన్నారు. బహుభాష కోవిదుడైనా మాతృ భాషను మరవద్దని తెలిపారు. 75 ఏళ్ల క్రితం స్థాపించిన ఏవీవీ విద్యా సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోందన్నారు. నిజాం ఏలుబడిలో ఉర్దూ భాషలోనే విద్యాభాస్యం ఉండాలన్న కఠినమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అప్పటి నిజాం నవాబును ఒప్పించి, మెప్పించి మన అస్తిత్వానికి ప్రతీకైన మాతృభాష తెలుగులోనే విద్యాబోధన జరిగేలా చొరవ తీసుకున్న చందా కాంతయ్య కృషి ఫలితమే ఈ విద్యాలయం అని అన్నారు. భారతదేశాభివృద్ధి నైతిక విలువల పునరుద్ధరణపైనే ఆధారపడి ఉంది అనే విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తానని అన్నారు. అందుకే ఈ రకమైన విద్యా విధానం తీసుకురావాలని తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల రంగంలో చేపడుతున్న పురోగతిని ఆయన అభినందించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మన ముందు విస్తృతమైన అవకాశాలు కనబడుతున్నాయని, అదే సంఖ్యలో సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని అన్నారు. ఇలాం టి పరిస్థితుల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని కోరారు. కృషి, పట్టుదలతో పాటు నైపుణ్యతను అలవర్చుకోవడం కీలకమైన అంశం అని వెంకయ్య నాయు డు అన్నారు. భారతదేశంలోని 65 శాతానికి పైగా ఉన్న యువతే భారత్‌కు అతిపెద్ద బలం అని అన్నారు. వచ్చే 35 ఏళ్ల పాటు ప్రపంచానికి అవసరమైన మానవ వనరులను అందించే శక్తి సామర్థ్యాలు భారత్ వద్ద ఉన్నాయన్నారు. అయితే, దీనికి కావల్సిందల్లా అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడమేనని అన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను
ప్రారంభించిందన్నారు. అయితే, పోటీ ప్రపంచాన్ని వేగంగా అందుకోవాలంటే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. మార్పుకు వారధులు యువతేనని అందుకే బాల్యం నుండే సృజనాత్మకతను అలవర్చుకొని నిత్యనూతన ఆలోచనలతో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఇప్పటి నుండే ఆలోచనలు చేయాలన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో ప్రారంభంలోనే అనవసరంగా పక్కదారులు పడుతున్నామన్నారు. అలా కాకుండా శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పినట్టు గమ్యం స్థిరంగా ఉండాలన్నారు. సమాజంలో పెచ్చుమీరుతున్న కుల, మత, లింగ వివక్షకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, తెలంగాణ ప్రభుత్వ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బండా ప్రకాష్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా, ఏవీవీ విద్యా సంస్థల సెక్రటరీ ఉపేందర్ శాస్ర్తీ, నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు