రాష్ట్రీయం

వృక్షాలను రక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రీన్ ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం సినిమా హీరో అర్జున్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. తమిళనాడులోని గేరుగాబక్కంలోని తన నివాసంలో హీరో అర్జున్, రోజాతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకి రాజ్యసభ సభ్యుడు సంతోష్ చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్ఫూర్తిగా తీసుకుని రోజా మొక్కలు నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి అక్సిజన్ అందించాలనే సంకల్పం గొప్పదన్నారు. దానికి నగరి ఎమ్మెల్యే రోజా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజావనంలో జగతిబాబు, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణి, ఉత్తమ నటి కుష్బూ పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసిరారు. రోజా కార్యక్రంలో పాల్గొని మొక్కలు నాటించడం గొప్ప శుభ పరిణామం అని ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.