రాష్ట్రీయం

ఆర్టీసీ జేఏసీ ఉద్యమం తాత్కాలిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 26: పట్టణాల్లో స్కూల్ బస్సులను ఆర్టీసీ రూట్లలో తిప్పేది లేదన్న రవాణా శాఖ మంత్రి పేర్ని నాని హామీతో ఈ నెల 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ఉద్యమం తాత్కాలికంగా వాయిదా పడింది. బుధవారం విజయవాడలో ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కార్యాలయంలో ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే జిలానీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలకమైన అంశాలు, యాజమాన్యం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపైన చర్చ జరిగింది. వీటన్నింటిపైన చర్చించేందుకు ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలు, అనుమానాలు తీర్చేలా చూస్తానని రవాణా మంత్రి పేర్ని నాని ఇచ్చిన హామీని గౌరవిస్తూ 28న చేపట్టదలిచిన ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ కన్వీనర్ దామోదరరావు, కో కన్వీనర్లు సీహెచ్ సుందరయ్య, వీ వరహాల నాయుడు తెలిపారు.