రాష్ట్రీయం

ఎట్టకేలకు ఢిల్లీ చేరిన అనె్నం జ్యోతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: కోవిడ్-19 వైరస్ నేపధ్యంలో చైనాలో చిక్కుకుపోయిన కర్నూలు జిల్లా నంద్యాల యువతి అనె్నం జ్యోతి గురువారం ఉదయం ఢిల్లీకి క్షేమంగా చేరింది. చైనా కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో వూహాన్ నుంచి ప్రత్యేక విమానంలో అనె్నం జ్యోతితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సత్యసాయి కృష్ణ, మరో 78 మంది భారతీయులు, 40 మంది పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, శ్రీలంక దేశాలకు చెందిన వారు భారత్‌కు బయలుదేరారు. వీరు ప్రయాణించిన విమానం ఢిల్లీకి ఉదయం 7.30 గంటలకు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ప్రత్యేక విమానంలో వచ్చిన వారందరినీ ఇండో టిబెట్ సరిహద్దు రక్షక దళానికి చెందిన వైద్యశాలకు తరలించారు. అక్కడ చైనా నుంచి వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో రెండు వారాల పాటు పరీక్షలు, చికిత్స నిర్వహించి అంతా సవ్యంగా ఉంటే స్వస్థలాలకు పంపుతారు. చైనాలోని వూహాన్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరడానికి ముందు అక్కడి వైద్యాధికారులు, భద్రతా సిబ్బంది అందరినీ మరోసారి పరీక్షించినట్లు తెలుస్తోంది. పరీక్షల్లో జ్వరం, జలుబు ఉన్న
వారిని విమానంలోకి అనుమతించలేదని వెల్లడవుతోంది. జ్వరం, జలుబుతో బాధపడుతున్న సుమారు 20 మందిని తిరిగి వూహాన్‌లోని ప్రత్యేక కేంద్రాలకు తరలించినట్లు సమాచారం. ఆరోగ్యంగా ఉన్న వారందరినీ విమానం ద్వారా ఢిల్లీకి పంపారు.
ఆరోగ్యంగా తెలుగు వారు
మన రాష్ట్రానికి చెందిన అనె్నం జ్యోతి, సత్యసాయి కృష్ణ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఢిల్లీ నుంచి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందజేశారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మిలిటరీ ఆసుపత్రిలో అందరికీ అవసరమైన పరీక్షలు, చికిత్స అందజేసి రెండు వారాల పాటు పరిశీలనలో ఉంచుతామని స్పష్టం చేశారు. ఆ తరువాతే వారిని స్వస్థలాలకు పంపుతామని వెల్లడించారు. అంతవరకు కుటుంబ సభ్యులను కూడా వైద్య కేంద్రంలోకి అనుమతించబోని పేర్కొన్నారు. చైనా నుంచి మొదటి విడత వచ్చిన 320 మందిని కూడా ఇలాగే వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన తరువాతే స్వస్థలాలకు పంపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
నరకం అనుభవించాం: జ్యోతి
చైనాలో నెల రోజులకు పైగా తాము నరకం అనుభవించామని అనె్నం జ్యోతి తన తల్లి ప్రమీలమ్మకు ఫోన్ ద్వారా తెలిపింది. ఢిల్లీ చేరినందుకు సంతోషంగా ఉందని, మరో 15 రోజులు ఉంటే ఇంటికి వస్తానని జ్యోతి పేర్కొంది. ఇక దిగులు లేదని సంతోషంగా ఉండాలని తల్లికి ధైర్యం చెప్పింది. కాగా ప్రమీలమ్మ ఢిల్లీకి వెళ్లాలని భావించినా భద్రతాధికారులు అనుమతించబోరన్న కారణంతో వెళ్లలేదని ఆమె బావ అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. జ్యోతికి చైనాలో ఎలాంటి చికిత్సలు అందించలేదని, ఆహారం కూడా సరిగ్గా అందకపోవడంతో ఇబ్బందులు పడిందని ఆయన అన్నారు. అందరి సహకారంతో ఆమె ఢిల్లీకి చేరడం సంతోషంగా ఉందన్నారు. జ్యోతి తిరిగి క్షేమంగా రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
*చిత్రం...అనె్నం జ్యోతి