రాష్ట్రీయం

వేసవికి ముందే.. నీరు.. ఆవిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో నదులు, రిజర్వాయర్లలోని నీరు గణనీయంగా ఆవిరైపోతోంది. దీనికితోడు రబీ సీజన్ నేపథ్యంలో ఇటు సాగు నీటికి, అటు తాగునీటికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలుండాల్సి ఉండగా 95 టీఎంసీలు మాత్రమే ఉంది. నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలకు 206 టీఎంసీలు. జూరాలలో 9.66 టీఎంసీకి 8.16 టీఎంసీ, తుంగభద్రలో 100.86 టీఎంసీకి 30.16 టీఎంసీ నీటి లభ్యత ఉంది. పులిచింతలలో 45.77 టీఎంసీకి 20.19 టీఎంసీ నీటి లభ్యత ఉన్నట్లు నీటిపారుదల శాఖ పేర్కొంది. ఎగువున కర్నాటకలో ఆల్మట్టిలో 129.72 టీఎంసీకి 63.64 టీఎంసీ, నారాయణపూర్‌లో 37.64 టీఎంసీకి 33.04 టీఎంసీ, నీటి లభ్యత ఉంది. సింగూర్‌లో 29.91 టీఎంసీకి కేవలం 1.30 టీఎంసీ, నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీకి 2.39 టీఎంసీ, శ్రీరాంసాగర్‌లో 90.31 టీఎంసీకి 54.10 టీఎంసీ, మిడ్ మానేరు రిజర్వాయర్‌లో 25.87 టీఎంసీకి 25.24 టీఎంసీ, కడెంలో 7.60 టీఎంసీకి 5.59 టీఎంసీ, శ్రీపాద యల్లంపల్లిలో 20.18 టీఎంసీకి 10.33 టీఎంసీ నీటి నిల్వలు ఉన్నాయి. భద్రాచలం దిగువున గోదావరి
నదిలోకి నీటి ప్రవాహం బాగా తగ్గింది. నీటి కొరతను నివారించేందుకు సీలేరు నుంచి దిగువకు వెయ్యి క్యూసెక్కులను వదిలారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర సాగు, తాగునీటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా బోర్డు తక్షణమే రాష్ట్రానికి 45 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నీటి పారుదల శాఖ విభాగం కృష్ణాబోర్డుకు లేఖను రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని పోతిరెడ్డిపాడుకు మళ్లిస్తోందని, దీనిపై నియంత్రణ లేదని పేర్కొన్నారు. అలాగే, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌లోకి నీటిని మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై కృష్ణాబోర్డు సమావేశమై నిర్ణయం తీసుకుని తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడాలని కోరారు. నీటి వినియోగం, కేటాయింపులకు చెందిన అనేకమైన దావాలు ట్రిబ్యునళ్లలో, కోర్టుల్లో ఉన్నాయి. తుది తీర్పు వెలువడే వరకు తెలంగాణ హక్కులను గుర్తించి అందుబాటులో ఉన్న నీటి లభ్యతలో ఎక్కువ నీటిని తమకు కేటాయించాలని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ కోరుతోంది. కృష్ణా బేసిన్‌లో తెలంగాణలో ప్రస్తుతం పొడి వాతావరణం నెలకొని ఉందని, నీటి ఎద్దడి తీవ్రం కాకుండా ముందే బోర్డు చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయినా, అక్కడి నుంచి నీటిని కృష్ణా బేసిన్‌లోకి మళ్లించినా, తమకు కృష్ణా ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల ద్వారా అదనపు నీటిని కేటాయించాల్సి ఉంటుందని తెలంగాణ సర్కార్ మొదటి నుంచి కోరుతున్న విషయం విదితమే. ప్రస్తుతం పెన్నా బేసిన్‌లోకి పోతిరెడ్డి పాడు ద్వారా శ్రీశైలం నీటిని మళ్లిస్తున్నారని తెలంగాణ సాగునీటిపారుదల శాఖ బోర్డు దృష్టికి తీసుకెళ్లింది.

*శ్రీశైలం రిజర్వాయర్ ( ఫైల్ ఫొటో)