రాష్ట్రీయం

రేవంత్ మెడకు భూ కబ్జాల ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డిపై భూ కబ్జా కేసు బిగుసుకుంటోంది. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలో రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి భూ కబ్జాలకు పాల్పడినట్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంలో రేవంత్‌రెడ్డి భూ ఆక్రమణకు సహకరించినట్టు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిపై వచ్చిన అభియోగంపై అతనిని సస్పెండ్ చేసి ఈ వివాదంపై రాజేంద్రనగర్ ఆర్డీవోను క్షేత్రస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి భూ ఆక్రమణను నిర్ధారిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మంగళవారం నివేదిక సమర్పించారు. ఈ భూ వివాదంపై బాధితులు ఇచ్చిన
ఫిర్యాదు మేరకు కొన్ని కేసులు ఇప్పటికే హైకోర్టు, జిల్లా కోర్టు, రెవెన్యూ కోర్టులో పెండింగ్‌లో ఉండగా చందానగర్, గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా, తాజాగా ఆర్డీవో ఇచ్చిన నివేదికలో రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి ఆధీనంలో ఉన్న సర్వే 127లోని భూమికి ప్రహరీ నిర్మించడంతో పాటు గేటు కూడా ఏర్పాటు చేసినట్టు ఆర్డీవో తన నివేదికలో పేర్కొన్నారు. ఈ సర్వే నంబర్‌లో కేవలం 10.21 ఎకరాలు మాత్రమే ఉండగా 12.02 ఎకరాలను రేవంత్‌రెడ్డి ఆక్రమించినట్టు ఆర్డీవో నిర్ధారించారు. ఇందులో అదనంగా ఆక్రమించుకున్న ఎకరా 21 గుంటల స్థలంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 34లోని 1.11 ఎకరాలు ఉండగా అందులో 9 గుంటలు ట్రాక్ రోడ్‌కు చెందినదిగా విచారణలో తేలింది. అలాగే ఇందులో శిఖం భూమి 32 గుంటలతో పాటు కోమటికుంట చెరువుకు చెందిన బఫర్ జోన్‌లో 22 గుంటలు ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి నీటి ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా ప్రహరీ నిర్మించినట్టు ఆర్డీవో పేర్కొన్నారు. అలాగే 127 సర్వే నంబర్‌ను ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 128, 160లోని సుమారు 10 గుంటలను ఆక్రమించినట్టు గుర్తించారు. వాస్తవానికి సర్వే నంబర్ 127లోని 10.21 ఎకరాలు వడ్డే హనుమ కుటుంబ సభ్యులది కాగా అందులో కేవలం 5 ఎకరాలు మాత్రమే ఇతరులకు విక్రయించారని, మిగిలిన 5.21 ఎకరాలు ఎవరికీ విక్రయించలేదని రెవెన్యూ రికార్డులో గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇలా ఉండగా 1993-94లో ఈ వివాదాస్పద స్థలాన్ని ఇంటి పేరు వడ్డె కాగా దుబ్బగా మార్చి విక్రయించినట్టు తేలింది. ఈ వివాదంపై ప్రభుత్వం, ప్రైవేట్, వాల్టా చట్టం కింద వివిధ కేసులతో పాటు క్రిమినల్ కేసులను రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడిపై నమోదు చేయడానికి రంగం సిద్ధమైంది.