రాష్ట్రీయం

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 రాకెట్‌కు కౌంట్ డౌన్ నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన (షార్)లో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ -10 ఉపగ్రహ వాహననౌక ద్వారా జీ ఐ శాట్-1 ఉపగ్రహాన్ని 5న రోదసీలోకి పంపేందుకు షార్ సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎంఆర్‌ఆర్ ఆధ్వర్యంలో మంగళవారం రాకెట్ రిహార్సల్స్ అనంతరం కౌంట్ డౌన్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 3.43 గంటలకు మొదలుకానున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్‌ఆర్ చైర్మన్ బీఎన్ సురేష్, కాటూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధత సమావేశం జరుగుతుందన్నారు. అనంతరం మూడు దశల రాకెట్ అనుసంధానం. తర్వాత చివరి పరిక్షలు నిర్వహించి లాంఛ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగిస్తారు. ఈ ప్రక్రియ అంతా ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో జరుగుతాయి. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు దీనిని రోదశిలోకి పంపుతారు. దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే జీశాట్ ముఖ్య ఉద్దేశం. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్ట మొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపిస్తున్నారు. వాతావరణం అంతా సానుకూలంగా సహకరిస్తే అనుకున్నట్లే ప్రయోగం జరుగుతుందని శాస్తవ్రేత్తలు తెలిపారు.

*చిత్రం... రెండవ లాంచ్‌ప్యాడ్‌పై ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీ ఎస్ ఎల్‌వీ ఎఫ్ -10 రాకెట్