రాష్ట్రీయం

విజయవాడలో తొలి కరోనా అనుమానిత కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విజయవాడకు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్ (కోవిడ్-19) సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ యువకుడుని నగరంలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు ఇటీవల జర్మనీ నుంచి విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్రమైన జ్వరం, జలుబు ఉండడంతో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా నిర్ధారణ కోసం శాంపిల్స్‌ని తిరుపతికి పంపించే ఆలోచన చేస్తున్నారు.
ప్రాథమిక పరీక్షలో అతనిలో కరోనా వైరస్ లక్షణాలేవీ లేవని కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ తెలిపారు. కరోనా వైరస్ పట్ల జిల్లా ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ చెప్పారు. జిల్లాలో కరోనా వైరస్‌పై వైద్య అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు 17 ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 69 పడకలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో రాపిడ్ రెస్పాస్స్ టీమ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టామన్నారు. .
*చిత్రం...విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేటెడ్ వార్డు