రాష్ట్రీయం

శ్రీశైలం డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్: శ్రీశైలం డ్యాంకు ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం తేదని డ్యాం భద్రతా నిపుణుల కమిటీ చైర్మన్ ఏబి పాండ్య తెలిపారు. శ్రీశైలం డ్యాం భద్రతపై గత మూడు రోజులగా నిపుణుల బృందం పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టింది. ఈ సందర్భంగా కమిటీ కమిటీ చైర్మన్ పాండ్య శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం పరిరక్షణకు పలు కీలక సూచనలు చేసినట్లు చెప్పారు. నిర్వహణలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించుకోవాలి అన్నారు. 2009 నాటి వరదల్లో కొట్టుకుపోయిన కుడిగట్టు పునరుద్ధరణ, ఫ్లంజ్‌పూల్‌కు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జలాశయం నిర్వహణకై రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్ విధులు, ఇతర విధులను వినియోగించుకోవాల్సి ఉందన్నారు. కాల గమనం ప్రకారం ఏ డ్యాంలోనైనా రకరకాల మార్పులు వస్తూ ఉంటాయన్నారు. దాని వల్ల రాబోయే రోజుల్లో శ్రీశైలం డ్యామ్ భద్రతకు ఏదైనా ప్రమాదం ఉంటుందా అనే అంశాన్ని పరిశీలించామన్నారు. పూర్తి వివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు రాజగోపాల్, బిఎస్.రావు, ఏవి.సుబ్బరావు, రౌతు సత్యనారాయణ, డ్యాం చీఫ్ ఇంజినీర్ మురళీనాథ్‌రెడ్డి, ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, ఈఈ వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... నిపుణుల కమిటీతో శ్రీశైలం డ్యామ్ అధికారులు