రాష్ట్రీయం

వైభవంగా డోలోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: భద్రాద్రి రామయ్య పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. వసంతోత్సవం వేళ రామయ్యపై శాస్త్రోక్తంగా అర్చకులు వసంతం చల్లడంతో రామయ్య పెళ్లికొడుకయ్యాడు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో డోలోత్సవం, వసంతోత్సవాన్ని సోమవారం ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఏప్రిల్ 2వ తేదీన భద్రాచలం మిథిలాస్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి కల్యాణానికి అవసరమైన తలంబ్రాల తయారీ కూడా సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని తొలుత ఉత్సవమూర్తులకు 25 కలశాల పంచామృతాలతో ప్రత్యేక స్నపనం నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారికి సహస్రధారలతో స్నపనం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రంగురంగుల పూలతో అలంకరించిన ఉయ్యాలలో శ్రీసీతారామలక్ష్మణులను ఆసీనులను చేశారు. ఈ సమయంలో ఆస్థాన గాయకులు రామదాసు, తూము నర్సింహదాసు కీర్తనలు ఆలపిస్తుండగా నక్షత్ర, కుంభ హారతులను స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించారు. డోలోత్సవంలో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆగమ సంప్రదాయం ప్రకారం హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని వసంతోత్సవాన్ని జరిపారు. వసంతం చల్లిన రోజున రామయ్యను పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసినట్లు భావిస్తారు. సాయంత్రం సీతారామలక్ష్మణులకు భాజాభజంత్రీలతో తిరువీధి సేవ నిర్వహించారు. అలాగే భద్రాద్రి రామయ్య కల్యాణంలో వినియోగించే తలంబ్రాల తయారీ కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టారు. చిత్రకూట మండపంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత కల్యాణ క్రతువులో పాల్గొనే రుత్వికుల సతీమణులు పసుపును రోట్లో దంచారు. అనంతరం పసుపు, కుంకుమ, నెయ్యి, అత్తరు, పన్నీరు, నూనె, సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలను సిద్ధం చేశారు. తొలిరోజున 20క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేయగా మొత్తంగా ఈ ఏడాది కల్యాణానికి 150 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేయనున్నట్లు ఆలయ ఈఓ గదరాజు నర్సింహులు తెలిపారు.