రాష్ట్రీయం

తిరుమలలో వేసవి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: రానున్న వేసవిలో గతంలో కన్నా మూడు నుంచి నాలుగు శాతం మంది భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని అంచనావేసి అందుకు తగిన విధంగా దర్శన, వసతి, ప్రసాదాల తయారీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, వేసవి ఉష్ణతాపంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. వేసవిలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై తిరుమల అన్నమయ్య భవన్‌లో మంగళవారం సీనియర్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు అవసరమైన రవాణా, వసతి, దర్శనం, ప్రసాదం, తాగునీటి సరఫరా, అల్పాహార, అన్నప్రసాదాల పంపిణీ, భద్రతతో పాటు భక్తులు తలనీలాలు సమర్పించడానికి తగిన ఏర్పాట్లపై ఆయన సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకునే భక్తులు తిరుమలలో ఆలయ నాలుగు మాడవీధుల్లో కాకుండా స్వామివారి దర్శనానికి వెళ్లే ప్రాంతాల్లో పాదరక్షలు ధరించకుండా వెళతారన్నారు. ఈ క్రమంలో వారికి ఎండవేడి తాపం తగలకుండా వారానికి ఒక మారు ఆ ప్రాంతాల్లో వైట్ కూల్ పెయింట్‌ను వేయడం ద్వారా వారికి కొంత ఉపశమనం కల్పించే చర్యలు చేపడుతున్నామన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతంతోపాటు రెండు శ్రీవారి సేవాసదన్‌లు, అక్కగార్ల గుడి, మొదటి ఘాట్‌రోడ్‌లో కూడా ఈ వైట్ కూల్ పెయింట్ వేస్తామన్నారు. శ్రీవారి ఆలయం ముంధు వైకుంఠం కాంప్లెక్స్, భక్తులు అధికంగా ఉండే రద్దీప్రాంతాల్లో తాత్కాలిక షెడ్ ఏర్పాటుచేస్తున్నామన్నారు. తలనీలాలు సమర్పించే భక్తులకు అసౌకర్యం కలగకుండా మే, జూన్ మాసాల్లో క్షురకులకు సెలవులు ఇవ్వకుండా మూడు షిప్టులూ పనిచేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్లాస్టిక్ వాటర్‌బాటిళ్ల నిషేధం ఉండటంతో రాగి బాటిళ్లు, స్టీల్ బాటిళ్లను, టప్పర్‌వేర్ బాటిళ్లను తమవెంట తెచ్చుకోవాలని కోరారు. కరోనా వైరస్ నివారణకు రద్దీ ప్రాంతాల్లో ప్రతి రెండు గంటలకు ఓసారి రోగనివారణ మందులతో పరిశుభ్రం చేస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేస్తామన్నారు. భక్తులు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నపుడు వారికి ధర్మల్‌గన్‌లతో వైరస్ బాధితులను గుర్తించేందుకు వీలుగా అవసరమైన వైద్యపరికరాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరంతో ఉన్నవారు దయచేసి తగ్గిన తరువాత తిరుమలకు రావాలని విజ్ఞప్తిచేశారు. ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, డిప్యూటీ ఈఓలు దామోదరం, బాలాజీ, సెల్వం, నాగరాజు, ఎస్‌ఇ-2 నాగేశ్వరరావు, ఆరోగ్యశాఖాధికారి ఆర్‌ఆర్ రెడ్డి, వీఎస్‌ఓ మనోహర్ పాల్గొన్నారు.

*చిత్రం...వేసవి ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి