రాష్ట్రీయం

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పర్యావరణాన్ని విధ్వంసం చేయడం వల్ల మానవాళికి హాని జరుగుతుందని, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని జాతీయ జీవ వైవిధ్య సంస్థ చైర్‌పర్సన్ డాక్టర్ వీబీ మాథూర్ అన్నారు. శనివారం ఇక్కడ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జీవవైవిధ్యంపై జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విధ్వంసం జరుగుతోందని, ఇది అవాంచనీయమై పరిణామమన్నారు. పర్యావరణలో మొక్కలు, జంతువులను సంరక్షించుకోవాలన్నారు. అప్పుడే మానవాళి మనుగడకు ప్రమాదం ఉండదన్నారు. త్వరలో పారిస్‌లో జీవవైవిధ్యంపై జరగనున్న 15వ అంతర్జాతీయ సదస్సులో పలు అంశాలపై విపులీకరంగా చర్చించనున్నట్లు చెప్పారు. డబ్ల్యుడబ్ల్యుఎఫ్ లా అండ్ పాలసీ పరిపాలన విభాగం డైరెక్టర్ విషాష్ ఉప్పల్ మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించుకునేందుకు సమిష్టి కృషి అవసరమన్నారు. ప్రకృతి వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనాలను ఆమె వివరించారు. కాలుష్య రహిత వ్యవస్థను కృషి చేయాలన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలన్నారు. మానవవనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ బీపీ ఆచార్య మాట్లాడుతూ, జీవవైవిధ్య పరిరక్షణకు బలమైన చట్టాలు, విధి విధానాల రూపకల్పన, అమలు అవసరమన్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఉన్న చట్టాలను ఆయన వివరించారు. ప్రజలను భాగస్యాములను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 140 మంది ట్రైనీ ఐఎఎస్‌లు, 61 ఐఎఫ్‌ఎస్ అధికారులు , 59మంది ఐపీఎస్‌లు పాల్గొన్నారు. ఈ సదస్సు లక్ష్యాన్ని సహాయ డైరెక్టర్ జనరల్ హరప్రీత్ సింగ్ వివరించారు.
*చిత్రం... సదస్సులో పాల్గొన్న జాతీయ జీవ వైవిద్య సంస్థ చైర్‌పర్సన్ డా. వీబీ మాథూర్ తదితరులు