రాష్ట్రీయం

అప్పన్న దేవస్థానం అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మార్చి 16: ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ నుండి మానవాళిని రక్షించుకునేందుకు ప్రభుత్వాలు విశ్వప్రయత్నా లు చేస్తున్నా యి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందిని పొట్టన పెట్టుకొని, లక్షలాది మందిని అనారోగ్యానికి గురిచేసిన కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల
మేరకు దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం కూడా అప్రమత్తమయింది. మూడు రోజుల కిందట జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కరోనా వైరస్ ప్రధానంశంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఈవో ఎం.వెంకటేశ్వరరావు విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌పై ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకున్న కీలక నిర్ణయాలను అధికారులతో చర్చించి మీడియాకి విడుదల చేశారు. అంతరాలయంలో ప్రస్తుతం జరుగుతున్న అష్టోత్తర, సహస్ర నామార్చనలు, స్వర్ణ తులసీ, పుష్పార్చనలు, లక్ష్మీనారాయణ వ్రతాలు వంటి ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలివేస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు ప్రకటించారు. వీఐపీలకు కూడా కేవలం దర్శనాలకు పరిమితం చేశారు. ప్రతీరోజు మధ్యాహ్నం స్వామివారి మహానివేదన సమయాన్ని గంట నుండి 20 నిమిషాలకు కుదించారు. స్వామివారి దర్శనం అనంతరం 10 నిమిషాల్లో భక్తులు ఆలయం వెలుపలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మహా నివేదన(రాజభోగం) సమయంలో వంద రూపాయల టిక్కెట్టు భక్తులు ఉత్తర రాజగోపురం వరకు మాత్రమే అనుమతి ఉండగ వారిని ధ్వస్తంభం వరకు అనుమతిస్తామని, 20 రూ.లు టిక్కెట్టు భక్తులను ఉత్తర రాజగోపురం వరకు అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. స్వామివారికి జరిగే ప్రత్యేక ఉత్సవాలను ఇక్కడకు వచ్చి ప్రత్యక్షంగా తిలకించడం కన్నా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడాలని అధికారులు సూచించారు. దేవాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశించినట్టు అధికారులు పేర్కొన్నారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అన్నప్రసాద భవనం, దర్శనం క్యూలు, కేశఖండన శాల పరిసరాల్లో ఎప్పటికప్పుడు డెటాల్, క్లోరిన్ వాటర్‌తో శుభ్రం చేయాలని ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు. 12 ఏళ్ళలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు తమ మొక్కులను వాయిదా వేసుకోవాలని సూచించారు. వ్యాధి తీవ్రత తగ్గేంతవరకు దేవస్థానం సూచనలు పాటించి, సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌పై మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ట్రస్ట్‌బోర్డు చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజు అధ్యక్షతన ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న ఈవో వెంకటేశ్వరరావు