రాష్ట్రీయం

పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మార్చి 16: పోలీసు వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పోలీసులను భాగస్వాముల్ని చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి క్లబ్‌లో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరాలను అదుపు చేయటంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నక్సల్స్ కార్యకలాపాలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ వివరించారు. వరంగల్ రేంజ్ డీఐజీ నాగిరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునిల్‌దత్, మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, మణుగూరు ఏఎస్పీ శబరీష్, భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర, ట్రైనీ ఐపీఎస్ అధికారి రోహిత్‌రాజు, కొత్తగూడెం ఓఎస్డీ రమణారెడ్డి, కొత్తగూడెం, ఇల్లందు, మహబూబాబాద్ డీఎస్పీలు ఎస్‌ఎం ఆలీ, రవీందర్‌రెడ్డి, నరేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్నడీజీపీ మహేందర్‌రెడ్డి