రాష్ట్రీయం

శ్రీశైలానికి కాలినడకన తరలివచ్చిన కర్నాటక భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని: ఉగాది వస్తోందంటే చాలు.. కర్నాటక భక్తులు శ్రీశైలం దారి పడతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్చుకుంటూ కాలినడకన మల్లన్న సన్నిధికి చేరుకుంటారు. శ్రీశైలంలో కొలువుతీరిన భ్రమరాంబికను ఆడపడుచుగా, మల్లికార్జునస్వామిని అల్లుడిగా భావించే కన్నడిగులు ఉగాది రోజు వారికి చీర, సారే తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది రోజు శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామిని కొలవడం కర్నాడిగుల ఆచారం. అందుకే కర్నాటక ప్రాంతంలోని రాయచూరు, బళ్ళారి, శిరుగుప్ప, గదగ్, బాగల్‌కోట్, గుల్బర్గా, గంగావతి, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని పలు మండలాల మీదుగా శ్రీశైలం బాట పట్టారు. కర్నాటక సరిహద్దు ప్రాంతానికి ఆదోని డివిజన్ ముఖద్వారం కావడంతో మంత్రాలయం, ఎమ్మిగనూరు, హొళగుంద, హాలహర్వి, చిప్పగిరి, ఆదోని, పత్తికొండ, దేవనకొండ, నందవరం తదితర ప్రాంతాల నుండి కర్నాటక భక్తులు తరలివస్తున్నారు. మహిళలు, పురుషులు, చిన్నారులు అన్న భేదం లేకుండా కాషాయ పతకాలు చేతబూని గుంపులు గుంపులుగా భ్రమరాంబిక, మల్లికార్జునుడిని స్మరిస్తూ ముందుకుసాగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ఎర్రటి ఎండను సైతం లెక్కజేయకుండా భక్త్భివంతో కర్నాటక భక్తులు సాగిస్తున్న పాదయాత్రను స్థానికులు సంఘీభావం తెలుపుతూ దారిపొడవునా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, అల్పాహారం, ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఆదోని డివిజన్‌లో చాలా ప్రాంతాల్లో కర్నాటక భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మరికొంత మంది కర్నాటక వాసులు వాహనాల్లో బియ్యం, పప్పులు, కూరగాయలు తీసుకువచ్చి మార్గమధ్యంలో శిబిరాలు ఏర్పాటుచేసిన అన్నదానం చేస్తున్నారు. కాలినడక భక్తుల సేవలో మేము సైతం అంటూ అటు కర్నాటక, ఇటు ఆంధ్ర భక్తులు తరలిస్తున్నారు.

*చిత్రం... శ్రీశైలానికి కాలినడకన వెళ్తున్న కన్నడిగులు