రాష్ట్రీయం

తిరుమలలో శ్రీవారి పుష్కరిణి మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 18 : భక్తులు ఎంతో పవిత్రంగా భావించి పుణ్యస్నానాలచరించే తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన శ్రీవారి పుష్కరిణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా నిత్యం భక్తులు స్నానమాచరించే శ్రీవారి పుష్కరిణిని కూడా మూసివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పుష్కరిణిలో స్నానాలు చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే విషయం మా దృష్టికి వచ్చిందన్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి శ్రీవారి పుష్కరిణి లోపలకు భక్తులను అనుమతించకుండా ప్రత్యామ్నాయంగా పుష్కరిణి బయట షవర్ ఏర్పాటు చేశామన్నారు. పుష్కరిణి నీటినే పంపింగ్ ద్వారా షవర్‌లోకి వదులుతున్నామన్నారు. దీని ద్వారా భక్తులు స్నానాలు ఆచరించవచ్చన్నారు. కొన్ని రోజులు కరోనా వైరస్ ప్రభావితం తగ్గేంత వరకు స్నానాలు నీటి షవర్ ద్వారా చేయాలని భక్తులను కోరారు. పుష్కరిణి పరిసరాలను ప్రతి రెండు గంటలకోసారి అంటురోగ నివారణ మందులతో శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్‌ఈ-2 నాగేశ్వరరావు, ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ ఆర్‌ఆర్ రెడ్డి, వీజీవో మనోహర్ ఇతర అధికారులు ఉన్నారు.

*చిత్రం...తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి