రాష్ట్రీయం

నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 2: ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ సందడి ప్రారంభమైంది. విదేశీ విహంగాల విడిది కేంద్రమైన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని నేలపట్టులో శుక్రవారం నుండి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఫెస్టివల్‌లో భాగంగా సూళ్లూరుపేటలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉదయం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను అధికారికంగా ప్రారంభిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే
ఈ ఏడాది పులికాట్‌లో సమృద్ధిగా నీరుండడంతో పెద్ద సంఖ్యలో ఫ్లెమింగోలు తరలివచ్చాయి. ఇప్పటికే ఈ ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతోంది. సూళ్లూరుపేట-శ్రీహరికోట రహదారి పక్కన పులికాట్ సరస్సులో నీళ్లు పుష్కలంగా చేరడంతో ప్రస్తుతం ఫ్లెమింగోలు, పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్ పక్షులు గుంపులు గుంపులుగా ఆహారవేటలో సందడి చేస్తున్నాయి. సీగల్స్, చిలువలు, నీటి కాకులు, నారాయణ పక్షులతో పాటు వివిధ రకాలకు చెందిన కొంగ జాతులు విపరీతంగా విడిది చేసి ఉన్నాయి. ముఖ్యంగా గూడబాతుల సందడి అంతా ఇంతాకాదు. నెల్లూరు జిల్లాతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుండి ఇక్కడకు పర్యాటకులు వచ్చే అవకాశమున్నందున అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శనతో వ్యవసాయ, అటవీ, ఉద్యాన, పశు సంవర్ధక శాఖలు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి రోజు సాయంత్రం పలువురు సినీ కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
'చిత్రం... పులికాట్ సరస్సులో విదేశీ పక్షుల సందడి