రాష్ట్రీయం

దేశరక్షణ కోసమే సీఏఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 4: ఆక్రమణదారులు, ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించేందుకే కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకువచ్చిందని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ దేశంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రారంభించారు. నగరంలోని మున్సిపల్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ కృష్ణాసర్కిల్, 7 రోడ్లకూడలి, ఎన్‌టీఆర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్ మీదుగా బస్టాండు సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ వరకు సాగింది. అంబేద్కర్ సర్కిల్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి షెకావత్ మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాలనలో అనేక సంస్కరణలు, ప్రజల్లో పరివర్తన తీసుకువచ్చిందన్నారు. భారత భూభాగమైన కాశ్మీర్‌లో అమలవుతున్న 370 ఆర్టికల్‌ను రద్దుచేసిన ఘనత మోదీదేనని అన్నారు. ముస్లిం దేశాల్లో ఎక్కడా అమలుచేయని ట్రిపుల్ తలాఖ్ ఆచారాన్ని మనదేశంలో అమలుచేస్తూ, ముస్లిం మహిళలను వేదనకు గురిచేస్తుండగా, తమ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. పాకిస్తాన్‌లో మైనార్టీలైన హిందువులను తరిమికొట్టారని, 10 లక్షల మంది అక్కడి నుంచి శరణార్థులుగా వచ్చారన్నారు. ఆ శరణార్థులంతా పౌరసత్వం కోసం 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని అన్నారు. వారికి ఎటువంటి గుర్తింపుకార్డులు లేక, పిల్లలను చదివించుకోలేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఆ శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం కోసం తెచ్చిన సవరణ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. పొరుగుదేశాల్లో దాడులకు గురై మన దేశానికి వచ్చిన హిందువులు, బౌద్దులు, సిక్కులు, జైనులకు పౌరసత్వం కల్పిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ, మమతా బెనర్జీ లాంటి వారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని
ఆరోపించారు. ముస్లిం మైనార్టీవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అలజడి సృష్టిస్తోందన్నారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, వాస్తవాలను తెలిపేందుకు దేశంలోని ఇంటింటికీ వెళ్తామని మంత్రి అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)కు మద్దతు తెలిపేందుకు 8866288662 కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని మంత్రి అన్నారు. బీజేపీ దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ అని, 10 కోట్లమంది ప్రజల మద్దతు తమకు ఉందన్నారు. మమత, రాహుల్, ఎంఐఎం పార్టీలు తమను ఏమీ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణకు దేశంలోని ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో ఉన్న రాహుల్ గాంధీకి వినిపించేలా ‘్భరత్ మాతాకి జై’ అని నినాదాలు చేయాలంటూ ఆయన ‘్భరత్ మాతాకి జై’ అని నినదించారు. సభలోని ప్రజలందరూ మంత్రితో గొంతు కలిపారు. సభలోనే కేంద్రమంత్రి షెకావత్ సమక్షంలో టీడీపీ మాజీ అధికార ప్రతినిధి యామిని బాల పార్టీలో చేరారు. ర్యాలీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనాచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సినీనటి కవిత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

''చిత్రాలు.. సీఏఏకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో కడప నగరంలో శనివారం నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్