రాష్ట్రీయం

విద్యుత్ ఉద్యోగుల విభజనలో మరో వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 4: విద్యుత్ ఉద్యోగుల పంపకాల్లో మరోసారి వివాదం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర, తెలంగాణ మధ్య రాష్ట్ర స్థాయి క్యాడర్ ఉద్యోగుల పంపకాలపై గతంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు ఏపీకి 52, తెలంగాణకు 48 శాతం ఉద్యోగులను కేటాయించాల్సి ఉంది. ఏపీ, తెలంగాణల్లో మొత్తంగా సుమారు ఆరు వేల మంది వరకు స్టేట్ క్యాడర్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల పంపకాలకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు గతంలో జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. గత శుక్రవారం కమిటీ తుది తీర్పును ప్రకటించింది. నాలుగు నెలల్లో ఇరు రాష్ట్రాలు ఈ తీర్పును అమలు చేయాలని ఆదేశించారు. విభజన అనంతరం 2015 జూన్ 10వ తేదీన తెలంగాణ విద్యుత్‌శాఖ.. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. దీంతో వివాదం మొదలైంది. జస్టిస్ ధర్మాధికారి జారీ చేసిన జాబితా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తెలంగాణలో పనిచేస్తున్న వారినే ప్రామాణికంగా తీసుకుందని, దీన్ని నిలుపుదల చేస్తున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇది సోమవారం సుప్రీం బెంచ్ వద్దకు రానున్నట్లు తెలిసింది. ధర్మాధికారి కమిషన్ తుది నిర్ణయంపై ఉద్యోగ సంఘాల్లో సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలు గతంలో రిలీవ్ చేసిన 1150 మందిలో 655 మందిని ఏపీకి కేటాయించారు. అయితే ఏపీలో పనిచేస్తూ తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులను కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని చెప్తున్నారు. మొత్తంగా ఆరువేల మంది ఉద్యోగులను ప్రామాణికంగా తీసుకుని రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజన జరపాల్సిందిగా ఏపీ ట్రాన్స్‌కో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
సుప్రీం తీర్పు వెలువడేంత వరకు జస్టిస్ ధర్మాధికారి ఉత్తర్వులను నిలుపుదల చేయటంతో పాటు ఈ మేరకు ఉద్యోగులను రిలీవ్ చేయరాదని తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ ట్రాన్స్‌కో శనివారం లేఖ పంపింది. ఒకవేళ రిలీవ్ చేసినా ఏపీలో పోస్టింగ్ కల్పించేందుకు ఖాళీలేదని స్పష్టం చేసింది. ఏక సభ్య కమిటీ నివేదిక పూర్తిస్థాయిలో అమలు జరిపితే ఆంధ్రకు నష్టం ఉండదని, ఉద్యోగుల విభజన జాబితా మాత్రమే లోపభూయిష్టంగా ఉందనే వాదనలు వినవస్తున్నాయి. సుప్రీంకోర్టులో తేలిన అనంతరమే పంపకాలపై స్పష్టత ప్రకటిస్తామని ఏపీ ట్రాన్స్‌కో వెల్లడించింది. దీనిపై టీఎస్ సర్కార్ ఏ రకంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.