రాష్ట్రీయం

వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి విఐపీలకు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈనెల 6వ తేదీ ఉదయం ధనుర్మాస కైంకర్యాల అనంతరం తెల్లవారు జామున 2 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం అవుతుందని ఉదయం 5 గంటల నుంచి
సర్వదర్శనం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. విఐపీలతోపాటుగా సామాన్య భక్తులకు మహాలఘు దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. భక్తులను 5వ తేదీ ఉదయం నుండి క్యూలైన్లలోకి అనుమతిస్తామని ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, ఆతరువాత నారాయనగిరి ఉద్యానవనాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్డు, చివరగా కల్యాణవేదికలో భక్తులను నింపుతామన్నారు. క్యూలైన్లలో ఎక్కువ సేవ నిలబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈఓ వివరించారు. భక్తులకు అన్నప్రసాదాలు, అల్పాహారం, టీ, కాఫీ పంపిణీకి ప్రణాళికబద్దంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 172 ప్రాంత్లాలో 3 లక్షల తాగునీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచుకున్నామని, 9 లక్షల లడ్డూలు నిల్వ ఉంచామని చెప్పారు. అదనపు ఈఓ ఏ.వి.్ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ట్రస్టుకు విరాళాలు అందించిన భక్తులకు వైకుంఠ ఏకాదశికి 2,500 మందికి, ద్వాదశి రోజులన 2500 మందికి కూడా మహాలఘు దర్శన సౌకర్యం కల్పిస్తామన్నారు. వీరు ఉదయం 10 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద రిపోర్టు చేయాలన్నారు. టీటీడీ సివిఎస్వో గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ మొదట వచ్చే భక్తులను ఆళ్వార్ ట్యాంక్ విశ్రాంతిగృహం వద్ద ఉన్న ప్రవేశమార్గం ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అక్కడ నుంచి నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లలోకి పంపిస్తామన్నారు. ఆ తరువాత వచ్చే భక్తులను మేదరమిట్ట వద్ద ఉన్న ఎన్ 1 ప్రవేశమార్గంలో డబ్ల్యు 7 గేటు ద్వారా మాడ వీధుల్లోకి అనుమతిస్తామని చెప్పారు. దక్షిణమాడ వీధిలో 6,500 మంది, పడమర మాడ వీధిలో 14వేల మంది, ఉత్తర మాడవీధిలో 19వేల మంది, తూర్పు మాడవీధిలో 4వేల మంది భక్తులు కూర్చునేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. చివరిగా వచ్చే భక్తులను కల్యాణవేదిక వద్ద అనుమతిస్తామని చెప్పారు.

'చిత్రం...టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్