రాష్ట్రీయం

కిషన్‌రెడ్డిని కలిసిన మాజీ ఎంపీ జేసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 6: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ.కిషన్‌రెడ్డి అనంతపురం వచ్చిన సందర్భంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎదురెళ్లి స్వాగతం పలకడం చర్చనీయాంశగా మారింది. గత రెండు రోజులుగా బీజేపీ నేతలను కలుస్తున్న ఆయన పార్టీ మారే యోచన్న ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా ప్రస్తుతానికి తాను టీడీపీని వీడేది లేదంటూనే కేంద్ర ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం చేసుకున్న తక్షణం బీజేపీలో చేరతానని స్పష్టం చేయడం గమనార్హం. సోమవారం అనంతపురం వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ.కిషన్‌రెడ్డిని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో హెలిపాడ్ వద్ద దివాకర్‌రెడ్డి కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తాను, కిషన్‌రెడ్డి మంచి మిత్రులమని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకూ తాను టీడీపీలోనే కొనసాగుతానని అన్నారు. ఏపీ రాజధాని మార్పుగురించి మాట్లాడుతూ అమరావతే రాజధానిగా ఉండాలన్నారు. దాన్ని విశాఖకు తరలించడం తలలేని పని అని జేసీ విమర్శించారు. ఒకవేళ విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నట్లయితే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని కొత్త మెలికపెట్టారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఇస్తారా, లేక కొత్త రాష్ట్రంగా ఇస్తారా అన్నది కేంద్రం ఇష్టమని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజధానులు మారుస్తూ రాయలసీమకు అన్యాయం చేశారని అన్నారు. కాగా రాష్ట్ర విభజన సమయంలో కూడా రాయల తెలంగాణగా ఏర్పాటు చేయండని, లేదా అనంతపురం జిల్లాను బళ్లారి జిల్లాలో చేర్చండని డిమాండ్ చేసిన జేసీ ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ డిమాండ్ చేయడం గమనార్హం.
'చిత్రం... హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన దివాకర్‌రెడ్డి