రాష్ట్రీయం

13న ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 13న మరోసారి హైదరాబాద్‌లో భేటీ కాబోతున్నా రు. తెలంగాణ ముఖ్యమంత్రి క్యాం పు కార్యాలయం ప్రగతిభవన్ వీరి భేటీకి వేదిక కానుంది. ఇదివరకు వీరిద్దరు రెండు పర్యాయాలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏ ర్పాటుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగ న్ ప్రకటన చేశాక జరుగబోతున్న వీరి భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు అంశం కూడా చర్చకు వచ్చే అవకా శం ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాఉండగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే అంశంపై గతంలో ఈ ఇద్దరు సీఎంల భేటీల్లో ప్రధానంగా చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీ ఏర్పా టు చేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మళ్లీ వీరి మధ్య భేటీ జరగలేదు. కాగా, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఇద్దరి మధ్య కూడా సమావేశాలు జరిగా యి. అయితే ప్రస్తుతం వీరిద్దరూ మారారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్లీ వీరి మధ్య పెం డింగ్‌లోని అంశాలపై కూడా సమావేశం జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా వివిధ సంస్థల విభజన జరగాల్సి ఉంది. షెడ్యూల్ 9, 10 ఆస్తులకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడడంతో పలు సంస్థల విభజన,
ఆస్తుల పంపిణీ పెండింగ్‌లో పడింది. ఇరు రాష్ట్రాల మధ్య జటిలంగా మారిన విద్యుత్ ఉద్యోగుల పంపిణీ అంశాన్ని ఇటీవల ధర్మాధికారి తీర్పు వెలువరించారు. ఈ మేరకు కొంతమంది ఉద్యోగులు తమకు కేటాయించిన రాష్ట్రంలో విధుల్లో చేరినప్పటికీ మరికొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు సీఎంల భేటీ తర్వాత తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం, ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంలో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను అక్కడి మంత్రులు తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంల భేటీపై ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
''చిత్రాలు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి