రాష్ట్రీయం

చైర్మన్ల ఎంపిక బాధ్యత కేటీఆర్‌దే : పువ్వాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 7: మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ ఎన్నిక బాధ్యత టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌దేనని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక శాసన సభ్యులతో కలిసి మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాల్టీలలో మంగళవారం జరిగిన పార్టీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లా పరిధిలో ఐదు మున్సిపాల్టీలలో పార్టీ గెలవడం ఖాయమని, అభ్యర్థుల ఎంపిక నుంచి చైర్మన్ల ఎంపిక వరకు అంతా కేటీఆర్ చూసుకుంటారని స్పష్టం చేశారు. ప్రజల మనస్సుల్లో స్థానం ఉన్న వారినే కౌన్సిలర్లుగా ఎన్నుకుంటారని, అటువంటి వారికే టీఆర్‌ఎస్ టికెట్ ఇస్తుందని స్పష్టం చేశారు.

'చిత్రం...మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్