రాష్ట్రీయం

సీఏఏను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 8: కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లింలు ఇతర దేశాలలో సంబంధాల కోసం రాజకీయం చేస్తున్నారని సీఎఎను ప్రశ్నించే హక్కు కమ్యూనిస్టులకు లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ రాబోయే రోజుల్లో సీఎఎపై స్పష్టంగా సఖ్యత ర్యాలీల ద్వారా తెలియజేస్తుందని ఆయన తెలిపారు. ఆయా పార్టీల నిజనిజాలను బీజేపీ బయటపెడుతుందన్నారు. దుష్ప్రచారాలను పూర్తిగా ఎదురుకొంటామన్నారు. పౌరసత్వ సవరణ రాజకీయ చర్చగా మారిందని, మూడు కోట్ల కుటుంబాలను దేశవ్యాప్తంగా కలవాలని బీజేపీ నిర్ణయించి దేశంలోని అన్ని రాష్టల్రు, జిల్లాలో ప్రచారం చేసి సీఎఎ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీపీలపై వివరిస్తుందన్నారు. ముస్లింలను దేశవ్యాప్తంగా భయాందోళనకు గురిచేస్తుందన్నారు. 130 కోట్ల మంది భారతీయులందరూ కూడా పౌరులుగా వుంటారని, కేవలం రాజకీయ లబ్ధికోసం మోదీ, బీజేపీ పార్టీని అప్రతిష్టపాలు చేయాలని కుట్రపన్నుతున్నారని ఆయన ఆరోపించారు. మహమ్మదాలీ జిన్నాకు లొంగిపోయి దేశ విభజనకు కారణమైంది నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కాదా అని ఆయన అన్నారు. ఎన్‌ఆర్సీని అస్సాంలో అమలు చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందని, ఎన్‌ఆర్సీపైన ఏదైనా చర్చ దేశవ్యాప్తంగా, రాష్ట్రాలతో చర్చించి అందరుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎన్‌పీఆర్ 2010లోనే అమలులోకి వచ్చిందని బీజేపీ చాలా స్పష్టంగా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. సీఎఎ రాజ్యాంగ వ్యతిరేకమైతే సుప్రీం కోర్టు కలుగజేసుకుని చెప్పే అధికారం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు కాబట్టి అది రాజధాని అని అంటున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే పరిపాలన అభివృద్ధి కోసం వికేంద్రికరణ చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎస్ సురేష్‌రెడ్డి, కె. ఆంజనేయరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్‌కుమార్ పాల్గొన్నారు.