రాష్ట్రీయం

హడావుడిగా ఢిల్లీకి పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 11: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హడావుడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పవన్ అధ్యక్షతన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండగా ఢిల్లీ నుండి ఫోన్‌కాల్ రావడంతో సమావేశం నుండి అర్ధాంతరంగా నిష్క్రమించి హడావుడిగా మంగళగిరి నుండి గన్నవరం వెళ్లారు. అక్కడి నుండి విమానం ఎక్కి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రులతో అపాయింట్‌మెంట్ లభించడంతో పవన్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్‌కళ్యాణ్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీకి వెళ్లారు.