రాష్ట్రీయం

నేడే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఇక్కడ ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఇద్దరు సీఎంల భేటీపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే పాల్గొంటారు. అధికారులు లేకుండా ఈ సమావేశం జరుగుతుందని సమాచారం. దేశ రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తమ రాష్ట్రంలో మూడు రాజధానులను నెలకొల్పాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అమరావతి నుంచి రాజధాని తరలిస్తారనే అంశంపై స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఆంధ్ర రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలకే
సంబంధించినదైనప్పటికీ, ఇద్దరు రాజకీయ నేతలు కలుసుకున్నప్పుడు స్థానిక రాజకీయాల గురించి తప్పనిసరిగా మాట్లాడుకుంటారని, ఈ అంశం చర్చకు వస్తుందని రాజకీయ విశే్లషకులు అంటున్నారు.
ఇటీవల పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి వైకాపా మద్దతు ఇవ్వగా, టీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. దీంతోపాటు జాతీయ పౌరపట్టికపై ఇద్దరు సీఎంలూ చర్చించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిస్థితులను ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం కనపడుతోంది. దీంతోపాటు విభజన చట్టంలోని అంశాలను కూడా చర్చించనున్నట్టు భోగట్టా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో ఆర్టీసీని అక్కడి సీఎం విలీనం చేయగా, తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఇది అసాధ్యమని ప్రకటించిన విషయం విదితమే.
ఇక నదుల అనుసంధానం అంశంపై కూడా ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. దీంతోపాటు విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అనేక అంశాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 88 క్యూసెక్కులకు పెంచాలని ఆంధ్ర ప్రభుత్వం చూస్తోందని, దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతాయని, దీనిపై చర్చించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను డిమాండ్ చేసిన విషయం విదితమే.
'చిత్రం... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి