రాష్ట్రీయం

నేడు హైపవర్ కమిటీ కీలక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 12: మూడు రాజధానులకు సంబంధించి జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సోమవారం మరోసారి భేటీ కానుంది. గత రెండుసార్లుగా సమావేశమైన ఈ కమిటీ ఇప్పటికే పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ (పాలనా రాజధాని) ఏర్పాటు ప్రక్రియపై కమిటీ ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దశలవారీగా ప్రభుత్వ శాఖల్లోని కీలక విభాగాలను తరలించాలా? లేక బీసీజే నివేదిక ప్రకారం అమరావతిలో కొన్ని శాఖలను కొనసాగించాలా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఇక అమరావతిలో రైతులకు అమలుచేస్తున్న ప్యాకేజీ, ప్లాట్ల అభివృద్ధికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. గత నాలుగు సంవత్సరాల నుంచి భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 30వేల నుంచి రూ. 50వేల వరకు ప్రభుత్వం కౌలు చెల్లిస్తోంది. వ్యవసాయ కూలీలకు నెలకు రూ. 2500 పింఛన్ మంజూరు చేస్తోంది. రైతుల నుంచి సేకరించిన 33వేల 500 ఎకరాల్లో 6వేల ఎకరాల వరకు వివిధ సంస్థలకు గత ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. కాగా రాజధాని ప్రాంతంలో నిర్దేశించిన రోడ్ల కారణంగా పొలాల మధ్య హద్దులు చెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఈ సమస్యలను ఏరకంగా పరిష్కరించాలనే విషయాన్ని హైపవర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు అమరావతి - అనంతపరం ఎక్స్‌ప్రెస్ హైవే, అంతర్గత రహదారుల పనులను సింగపూర్ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా గత ప్రభుత్వం చేపట్టింది. రాజధాని గ్రామాల్లో ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇవికాక కొండవీటి వాగు ముంపునకు సంబంధించి క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి పెద్దఎత్తున కాల్వల తవ్వకం జరిగింది. దీంతో రైతుల పొలాలు గుర్తుపట్టేందుకు వీలులేకుండా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలనే విషయమై హైపవర్ కమిటీ చర్చించాల్సి ఉంది. విశాఖకు పాలనా రాజధాని తరలింపును సచివాలయ ఉద్యోగులు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారితోనూ ఓ విడత సమావేశం నిర్వహించాలని కూడా హైపవర్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులకు ఇప్పటికే కొన్ని ఆఫర్లు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఇంకా ప్రక్రియ మొదలుకాలేదు. హెచ్‌ఓడీలకు మాత్రం వౌఖికంగా విశాఖలో సచివాలయ భవనాలకు సంబంధించి పరిశీలన జరపాలని ఆదేశాలు అందాయి. బోస్టన్ కమిటీలో ఆప్షన్-1 ప్రకారం కొన్ని శాఖలు విశాఖలో, మరికొన్ని అమరావతిలో ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండో ఆప్షన్‌లో మొత్తంగా సచివాలయాన్ని తరలించాలని సూచించింది. వీటిలో ఏ ఆప్షన్‌కు కమిటీ మొగ్గు చూపుతుందనేది తేలాల్సి ఉంది. ఈ నెల 18న కేబినెట్‌కు ముందు మరోసారి సమావేశం కావాలా? లేక ఇదే సమావేశంలో తుది నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలా.. అనే విషయాలను హైపవర్ కమిటీ పరిశీలిస్తోంది.