రాష్ట్రీయం

నేటి నుంచి అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో సోమవారం నుంచి అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌లో నిర్వహించనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌లో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఎర్పాట్లు చేపట్టింది. ఈ ఫెస్టివల్ ఈనెల 13 నుంచి 15 వరకు జరుగుతుంది. 20 దేశాల నుంచి 40 మందికి పైగా అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖతో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ఈ వేడుకలకు దేశ నలుమూలల నుంచి 25 రాష్ట్రాలకు చెందిన 60 మంది జాతీయ స్థాయి కైట్ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. ఇదిలావుండగా, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ తమ ఇళ్లల్లో స్వయంగా తయారుచేసిన స్వీట్‌లను ఈ ఫెస్టివల్‌లో అమ్మకాలు జరుపుతారు. రాష్ట్రంలో ఉన్న సంప్రదాయ ఆటల పోటీలు ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కైట్ ప్లేయర్లు, సందర్శకులు ఈ ఫెస్టివల్స్‌లో పాల్గొంటున్న సందర్భంగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని రకాల సాంప్రదాయబద్ధమైన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్, వంటకాలు వంటి అన్ని ఏర్పాట్లను అందుబాటులో ఉండేలా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ ఫెస్టివల్‌ను తిలకించేందుకు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతర అధికారులతో కూడిన బృందాలు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 5వ అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు.